విజయవాడ, ఆగస్టు 5 (way2newstv.com):
పోలవరం నిలిపేశామని టీడీపీ అసత్యప్రచారం చేస్తోంది. అసెంబ్లీ లొ కూడా పోలవరం ఫ్రై సీఎం జగన్ స్పష్టత ఇచ్చారు. తొమ్మిదేళ్లు సీఎం గా ఉన్నప్పుడు చంద్రబాబు అసలు పోలవరం ఊసే ఎత్తలేదని నీటి పారుదల శాఖా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. సోమవారం అయన మీడియాతో మాట్లాడారు. దివంగత నేత వైఎస్సార్ మహోన్నత ఉద్దేశంతో పోలవరం కి శ్రీకారం చుట్టా రు. గడిచిన ఐదేళ్లలో కూడా చంద్రబాబు పాలనలో పోలవరం పనులు నత్తనడకన సాగాయి. మూడేళ్లు పనులు చేపట్టకుండా ఎన్నికల ముందు పోలవరం వద్ద హడావిడి చెసి షో చేసారు. టీడీపీ హాయాంలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపి త్వరలోనే పనులు ప్రారంభిస్తాం. పోలవరం పనులకంటే ప్రచారంపైనే చంద్రబాబు ఎక్కువ శ్రద్ద పెట్టారు. పబ్లిసిటీ పిచ్ఛితో 200 కోట్లు వృధాచేసారు.
నిబంధలప్రకరామే నోటీసులు
వరద కారణంగా ఇప్పుడు పనులు ప్రారంభించే అవకాశం లేదు. రీ టెండరింగ్ నిర్వహించి పనులను నవంబర్ నుంచి పారదర్శకంగా జరిగేలా చేస్తాం. పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పునాది వేసిన పోలవరాన్ని అయన తనయుడు జగన్ మోహన్ రెడ్డి ప్రారంబిస్తారని అయన అన్నారు. దైవ నిర్ణయం కాబట్టే టీడీపీ హయాం లో పనులు ముందుకు సాగలేదు. సుజనా చౌదరి వ్యవహారం చూస్తే విస్మయం కలుగుతోంది. అయన ఇంకా టీడీపీ నేతగానే కొనసాగుతున్నారా అన్న అనుమానం కలుగుతోంది. టీడీపీ హయాం లో జరిగిన అవినీతిపై విచారణ ఆపేయాలని సుజనా చౌదరి చెప్పటం విడ్డురంగా ఉంది. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో జనంకి అరచేతిలో వైకుంఠం చూపించాడు. అవినీతి సొమ్ము మూటగట్టుకొని రాష్ట్రాన్ని అప్పులఊబిలో కి నెట్టారు. చంద్రబాబు ప్రభుత్వం చేసిన తప్పులని సరిదిద్ధి పాలనను గాడిలో పెట్టేందుకు సీఎం జగన్ కృషిచేస్తున్నారని అయన అన్నారు. నిబంధనల ప్రకారమే నోటీసులు ఇచ్చాం. పునరావాసం గురించి ఏమైనా పట్టించుకున్నారా..? పునరావాసానికి ఇంకా సుమారు రూ. 30 వేల కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. పునరావాసం విషయంలో మేం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాం. రివర్స్ టెండరింగుకు వెళ్తే తమ దోపిడీ బయట పడుతుందని టీడీపీకి భయమా..? కాఫర్ డ్యామ్ మునిగే పరిస్థితికి వచ్చింది.. స్పిల్ వే మునిగిపోయింది. ప్రధాని మోడీని సీఎం కలవబోతున్నారు.. పోలవరం ప్రాజెక్టుకు కావాల్సిన నిధులు అడుగుతారు. చంద్రబాబుకు చింత అనవసమని అన్నారు. సెప్టెంబర్ మధ్య నాటికి కొత్త ఏజెన్సీకి పనులు అప్పజెబుతాం. ప్రీ-క్లోజర్ విషయాన్ని పీపీఏకు.. కేంద్రానికి నోట్ పంపాం. పోలవరం ఒక్కటే కాదు.. నిబంధనలకు విరుద్దంగా అంచనాలు పెంచి ఖరారు చేసిన ప్రతి ప్రాజెక్టుకు రివర్స్ టెండరింగ్ విధానాన్ని అమలు చేస్తాం. నవయుగకు ఇంకా డబ్బులు చెల్లించాల్సిన అవసరం ఏముంది..? నవయుగకు నష్టపరిహరం చెల్లించడం దేనికి..? డీజిల్, సిమెంట్, స్టీల్ ఖర్చులు ప్రభుత్వమే పెట్టిందని అయన అన్నారు.
Tags:
Andrapradeshnews