సంపూర్ణ ఆరోగ్యం కోసం జాగ్రత్తలు పాటించాలి - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

సంపూర్ణ ఆరోగ్యం కోసం జాగ్రత్తలు పాటించాలి

రాజమహేంద్రవరం:ఆగష్టు (way2newstv.com)
సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ శ్రీనివాస్ సూచించారు. గోదావరి వరద ప్రవాహం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో గోదావరి లంకల్లోని ప్రజలకు స్థానిక కోటిలింగాల పేట పందిరి మహాదేవుడు సత్రంలో పునరావాసం కల్పించారు. ఈ సందర్భంగా వారి ఆరోగ్య పరిరక్షణ కోసం నగర తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. 
సంపూర్ణ ఆరోగ్యం కోసం జాగ్రత్తలు పాటించాలి 

ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని హాజరై పునరావాస కేంద్రంలోని ప్రజలకు మందులు పంపిణీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం వర్షాకాలం నేపథ్యంలో వ్యాధులు ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ యువ నాయకులు ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) మాట్లాడుతూ వర్షాకాలంలో కాచి చల్లార్చిన మంచినీళ్లను సేవించడం ఉత్తమ మన్నారు. మాజీ కార్పొరేటర్ కొమ్మా శ్రీనివాస్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో కొమ్మా రమేష్, నల్లం ఆనంద్ సహకారం అందించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు కోరుమిల్లి విజయశేఖర్, మరి దుర్గ శ్రీనివాస్, సింహ నాగమణి, కొమ్మ శ్రీనివాస్, మజ్జి పద్మ, నాయకులు రెడ్డి రాజు,  హిత కారిణి సమాజం చైర్మన్ యాళ్ల ప్రదీప్, ఉప్పులూరు జానకిరామయ్య, కంటిపూడి శ్రీనివాస్, బుడ్డిగ రవి, మళ్ళా వెంటరాజు, నిమ్మలపూడి గోవింద్, సంసాంగ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.