న్యూఢిల్లీ, ఆగస్టు 10, (way2newstv.com)
పాకిస్తాన్ కు చెందిన కళాకారులు, ఆ దేశ ప్రజలతో ఉన్న ద్వైపాక్షిక సంబంధాలను నిషేధించాలని డిమాండ్ చేస్తూ.. ఆల్ ఇండియన్ సినీ వర్కర్స్ అసోసియేషన్ ప్రధాని మోడీకి లెటర్ రాసింది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత పాకిస్తాన్ తమ దేశంలో భారతీయ చిత్రాల ప్రసారాలను, విడుదలను నిషేధించింది.
పాక్ కళాకారులను నిషేధించాలి
దీంతో అసోసియేషన్ కూడా పాక్ ఆర్టిస్టులను ఇండియాలోకి అనుమతించకూడదని పిఎం మోడీకి ఓ లెటర్ రాసింది. ఆ లేఖలో, “పాకిస్తాన్ కు చెందిన మూవీ మేకర్స్, ఆర్టిస్ట్స్, వాణిజ్య భాగస్వాముల్ని పూర్తిగా నిషేధించాలని, ఆ తర్వాతనే మొత్తం భారత చిత్ర పరిశ్రమ,సినీ కార్మికులు తమ పనిని తిరిగి ప్రారంభిస్తామని “చెప్పి తమ విధులను ఒకరోజు బహిష్కరించింది.
Tags:
all india news