వైకాపా కేంద్ర కార్యాలయం ప్రారంభం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

వైకాపా కేంద్ర కార్యాలయం ప్రారంభం

అమరావతి, ఆగస్టు 10, (way2newstv.com)
గుంటూరు జిల్లా  తాడేపల్లిలో వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని ఆ పార్టీ అధినేత, సీఎం జగన్ శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రీజినల్ కో–ఆర్డినేటర్లు, పార్లమెంటు జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర అధికార ప్రతినిధులు, రాష్ట్ర అనుబంధ విభాగాల అధ్యక్షులు, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు, ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు హాజరు  అయ్యారు. ఈ కార్యాలయంలో ఐటీవింగ్, అనుబంధ విభాగాలు, ముఖ్యనేతల ఛాంబర్లు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు మోనిటరింగ్ చేసేందుకు వీలుగా పార్టీ సిబ్బంది ఏర్పాట్లు చేశారు. 
 వైకాపా కేంద్ర కార్యాలయం ప్రారంభం

మూడు అంతస్తుల్లో పార్టీ కార్యాలయం నిర్మించారు. మొదటి ఫ్లోర్లో పార్టీ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రెండవ ఫ్లోర్లో పార్టీ అనుబంధ విభాగాలు పనిచేయనున్నాయి. మూడవ ఫ్లోర్లో పార్టీ అధ్యక్షుడు జగన్కు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డికి, పార్టీ కేంద్ర కమిటీ సభ్యులకు ఛాంబర్లు ఏర్పాటు చేశారు. గతంలో హైదరాబాద్ లోటస్పాండ్ కేంద్రంగా జరిగిన పార్టీ కార్యకలాపాలు.. ఇక నుంచి తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి కొనసాగనున్నాయి. కార్యక్రమంలో భాగంగా కార్యాలయంలోని అన్ని విభాగాలను జగన్ పరిశీలించారు. ముందుగా ముఖ్యమంత్రి సీఎం జగన్ చేతుల మీదుగా పార్టీ జెండా ఆవిష్కరణ జరిగింది. కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మహానేత వైఎస్ రాజశేఖర్రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.