హైదరాబాద్ ఆగస్టు 14, (way2newstv.com)
అసలే వర్షాకాలం. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రోడ్లన్ని జలమయం అవుతున్నాయి. ఏ కాల నీల్లో చూసినా అస్తవ్యస్తంగా మారాయి. చందానగర్ డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాలలో రహదారులు అస్తవ్యస్తంగా మారడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులెదుర్కొంటున్నారు. ఇటీవల కురు స్తున్న వర్షాలకు రోడ్లన్ని దెబ్బతిని గోతులమయంగా మారాయి. ఈ రోడ్లపై వెళ్లాలంటే వాహనదారులు నిత్యం నానా ఇక్కట్లు కు గురవుతున్నారు. సంబంధిత అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్టు వ్యవహ రిస్తున్నారు. చందానగర్‌లోని పలు కాలనీల్లో రోడ్లు అస్తవస్తంగా మారి వాహనచోదకు లకు చుక్కలు చూపిస్తున్నాయి.
బురదలతో రోడ్లు ఇలా... ప్రయాణమెలా..!
ప్రధానంగా పోలీసు స్టేషన్ సిగల్ ముందు నుంచి ఓల్డ్ ముంబాయి సర్వీసు రోడ్డు, ఆదర్శనగర్ కాలనీలోని రోడ్లు, శం కర్‌నగర్ రోడ్లు వర్షానికి పూర్తిగా చెడిపోయాయి. ఈ రహదారులపై భారీ గుంతలు ఏర్పడి వాటిలో వర్షపు నీరు నిలిచి వాహనదారులను ముప్పు తిప్పలు పెడుతున్నాయి. నీరు రహదారులపై చేరి చిన్నపాటి కుంటలను తలపిస్తున్నాయి. రోడ్లపై గోతులతో అతుకులు, గతుకులుగా మారి ఇసుక పేరుకుపోయి ప్రమాదభరితంగా తయారయ్యాయి. కొద్దిగా వేగంపెంచితే ద్వి చక్రవాహనదారుల పరిస్థితి అంతే సంగతులు. ముందు వాహనం వేగంగా వెళ్తే వచ్చేదుమ్ముతో వెనక వారికి దారి కనిపించని పరిస్థితి సైతం నెలకొంది.చుట్టు పక్కల గ్రామాల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు షాపింగ్‌లు, వ్యాపా రాల కోసం ఇక్కడికి వస్తుండడంతో నిత్యం రోడ్లు రద్దీగా ఉంటాయి. ఐటీ సంస్థలకు, ఇతర కార్యాలయాలకు వెళ్లే వారు ఉదయం, సాయంత్రం వేళల్లో బిజీబిజీగా వాహనాలపై దర్శనమిస్తారు. ఇక్కడి రహదారులు అధ్వానంగా తయారవడంతో వాహనదారులు నానా ఇక్కట్లకు గురవుతున్నారు. గుంతలు గుంతలుగా మారిన రహదారులపై ప్రయాణించేందుకు నరకయాతన పడుతున్నారు. రాత్రి వేళ్లల్లో ఈ గుంతల్లో పడి పలువురు ప్రమాదాలకు గురవుతున్నారు. వీటి కారణంగా ట్రాఫిక్ జాం అవుతోంది. ఫలితంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కాలనీల్లో ప్రజలు నడిచేందుకు నానాయాతన పడుతున్నారు. గుంతల్లో నీరు నిలవడంతో ఎక్క డ ఏముందో తెలియని పరిస్థితి నెలకొంది. ఎక్కడ ఏ మ్యాన్‌హౌల్లు ఉ న్నాయోనని వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు.
Tags:
telangananews