వారం లోపల బడ్జెట్ ప్రతిపాదనలు తీసుకు రండి: హోం మంత్రి ఆదేశం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

వారం లోపల బడ్జెట్ ప్రతిపాదనలు తీసుకు రండి: హోం మంత్రి ఆదేశం

హైదరాబాద్ ఆగష్టు 10 (way2newstv.com)
హోం మంత్రి మహమ్మద్ మహ్మూద్ అలీ హోం డిపార్టుమెంటుకు సంబంధించి 2019-20 ఆర్ధిక సంవత్సరం కొరకు చేయబోయే బడ్జెట్ ప్రతిపాదనల నేపధ్యంలో హోం ప్రిన్సిపల్ సెక్రటరీ రాజీవ్ త్రివేది, ఐ.పి.ఎస్., డి.జి.పి. యం మహేందర్ రెడ్డి మరియు  హోం డిపార్టుమెంటు కు చెందిన అందరు శాఖాధిపతులతో, సచివాలయంలోని డి-బ్లాక్ మినీ కాన్ఫరెన్స్ హాల్ లో సమావేశం అయ్యారు. వివిధ శాఖాధిపతులు సమర్పించిన ఖర్చు, అవసరాలు, పెండింగ్ బిల్లుల వివరాలు సమీక్షించి... 
వారం లోపల బడ్జెట్ ప్రతిపాదనలు తీసుకు రండి: హోం మంత్రి ఆదేశం

ఈ సమావేశంలో చర్చించిన విధంగా, శాఖలవారీగా పూర్తి స్థాయి బడ్జెట్ ప్రతిపాదనలు తీసుకుని, వారం లోపల తదుపరి సమావేశానికి రావాలని కోరారు. ఈ సందర్భంగా, హోం మంత్రి తెలంగాణ పోలీస్ శాఖ వివిధ ప్రజా ఉపయోగ, వినూత్న కార్యక్రమాలు చేస్తూ, అన్ని విభాగాలలో మంచి పురోగతి సాధిస్తోందని, దేశంలోనే మంచి పేరు తెచ్చుకోందని ప్రశంసించారు. శాఖ యొక్క అత్యవసర, ముఖ్య సేవలకు ఆటంకం కలుగకుండా ఉండేందుకు సరిపడా బడ్జెట్ కేటాయింపులకు ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. తేజ్ దీప్ కౌర్ మీనన్, ఐ.పి.ఎస్., డిజిపి, ఎస్పీయఫ్,  సంతోష్ మెహర, ఐ.పి.ఎస్., డైరెక్టర్, తెలంగాణ పోలీస్ అకాడమీ, రవి గుప్త, ఐ.పి.ఎస్., ఏ.డి.జి., పోలీస్ కంప్యూటర్ సర్వీసెస్, సందీప్ శాండిల్య, ఐ.పి.ఎస్., ఏ.డి.జి., జైళ్ళు & రైల్వేస్, పోలీస్ కమీషనర్లు అంజని కుమార్, ఐ.పి.ఎస్., యం.యం. భగవత్, ఐ.పి.ఎస్., సజ్జనార్, ఐ.పి.ఎస్. లు ఈ సమావేశంలో పాల్గొన్నారు.