తిరుమల ఆగష్టు 23 (way2newstv.com)
తిరుమలలో మరోసారి అన్యమత ప్రచారం కలకలం రేగింది. ఆర్టీసీ బస్సులలో ఇచ్చే టికెట్ల వెనుకల జెరూసలేం మక్కా మసీదు యాత్రకు సంబంధించి అప్పటి టిడిపి ప్రభుత్వం ప్రకటనలతో ఉన్న టికెట్లను ఆర్టీసీ సిబ్బంది ప్రయాణికులకు ఇచ్చారు. దీంతో అవి తీసుకున్న భక్తులు అన్యమత ప్రచారం నిషేధం ఉన్న తిరుమల లో ఈ టికెట్ లుఇవ్వడం పై అభ్యంతరం వ్యక్తం చేశారు.
తిరుమలలో అన్యమత ప్రచారం
దీంతో పొరపాటును గుర్తించిన ఆర్టీసి సిబ్బంది వాటిని వెనక్కి తీసుకొని మరో టికెట్ అందజేశారు. ఆర్టీసీ టికెట్ లు వాడే రోల్ వెనుక గత టిడిపి ప్రభుత్వం పథకాలను ముద్రించేవారు. అలా ముద్రించిన న పాత రోల్స్ లో పొరపాటున మూడు రూల్స్ తిరుమల చేరుకున్నాయని.. సిబ్బంది తెలియకుండా వాటిని భక్తులు ఇచ్చారని వివరణ ఇచ్చారు ఆర్టీసీ అధికారులు .ముందు ముందు ఇలాంటి ఘటనలు జరగకుండా అన్ని రోజులు జాగ్రత్తగా పరిశీలించే భక్తులకు టికెట్ల జారీ చేస్తామని తెలిపారు