ప్రకాశం పంతులుకు ఘన నివాళీ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ప్రకాశం పంతులుకు ఘన నివాళీ

కర్నూలు, ఆగస్టు 23,(way2newstv.com):
ఆంద్ర తొలి రాష్ట్ర ముఖ్యమంత్రి స్వర్గీయ టంగుటూరి ప్రకాశం పంతులు  చేసిన త్యాగాన్ని ఆదర్శంగా తీసుకొని ఒక్కొక్కరు నడుచుకోవలని జిల్లా కలెక్టర్ జి.వీర పాండియన్ సూచించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ భవనంలో టంగుటూరి ప్రకాశం పంతులు  148వ జయంతి ఉత్సవంలో ఆయన పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ తో పాటు జాయింట్ కలెక్టరు-2 ఖాజా మొహిద్దీన్, డిఆర్ఓ వెంకటేశం తదితరులు టంగుటూరి ప్రకాశం పంతులు గారి చిత్రపటానికి పూలమాల వేసి  ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ టంగుటూరి ప్రకాశం  దేశం, రాష్ట్రం, సమాజం కోసం త్యాగం చేయడం గర్వించదగ్గ విషయమన్నారు. 
ప్రకాశం పంతులుకు ఘన నివాళీ

ఆయన నడిచిన బాటను స్పూర్తిగా తీసుకొని అదే రీతిలో పనిచేయాలని అధికారులని, సిబ్బందిని సూచించారు. సేవాభావం  చేసే గుణం ప్రతి అధికారి, సిబ్బందిలో ఖచ్చితంగా వుండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా చిరునవ్వుతో పలకరించి ప్రజాసమస్యల పరిష్కరానికి పెద్ద పీట వేయాలని సూచించాలన్నారు. ఏదైన సంకల్పించిన పనిని కమిట్ మెంట్ తో చేయగలిగితే ఫలితాలు కూడా అదే రీతిలో వుంటాయని కలెక్టర్ తెలిపారు. విలువలతో కూడిన విషయాలను నేర్చుకొని ఆచరణలోకి తీసుకరావాలని కలెక్టర్ ఈ సందర్బంగావివరించారు. పొట్టి శ్రీరాములు మరణానంతరం ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైన ఆంధ్రరాష్ట్రానికి తొలిముఖ్యమంత్రృ విశిష్ట సేవలందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సిఇఓ విశ్వేశ్వరనాయుడు, ఎపియంఐపి ప్రాజెక్టు అధికారి పుల్లా రెడ్డి, డియంహెచ్ ఓ ప్రసాద్, సమాచార పౌర సంబంధాల శాఖ డిడి పి.తిమ్మప్ప, మెప్మా పిడి నారార్జున నాయుడు తదితర జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.