బొత్సకు సీబీఐ నోటీసులు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

బొత్సకు సీబీఐ నోటీసులు

విజయవాడ, ఆగస్టు 23 (way2newstv.com):
వోక్స్ వ్యాగన్ కేసులో ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణకు హైదరాబాద్‌ సీబీఐ కోర్టు సమన్లు పంపింది. సెప్టెంబర్ 12న కోర్టుకు హాజరుకావాలని సమన్లలో పేర్కొంది. వోక్స్ వ్యాగన్ కేసులో బొత్స సత్యనారాయణ సాక్షిగా ఉండటంతో ఈ నోటీసులు పంపారు. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో వోక్స్ వ్యాగన్ వ్యవహారం తెరపైకి వచ్చింది. అప్పుడు బొత్స సత్యనారాయణ భారీ పరిశ్రమలశాఖ మంత్రిగా ఉన్నారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వోక్స్ వ్యాగన్ సంస్థ విస్తరణ పేరుతో విశాఖలో కార్ల కంపెనీ ఏర్పాటుకు ముందుకు వచ్చింది. 
బొత్సకు సీబీఐ నోటీసులు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బొత్స సత్యనారాయణ భారీ పరిశ్రమల మంత్రిగా ఉన్న సమయంలో జర్మనీకి చెందిన వోక్స్ వ్యాగన్ సంస్థ మధ్యవర్తిగా ఉన్న వశిష్ట వాహన్ అనే కంపెనీ రూ.11 కోట్లు చెల్లించారు. అయితే వశిష్ట వాహన్‌తో తమకు సంబంధం లేదని వోక్స్ వ్యాగన్ ప్రకటించడంతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. అవకాశాన్ని ఆసరా చేసుకున్న వోక్స్ వ్యాగన్ కంపెనీ బోర్డు సభ్యుడు హెల్మత్ షుష్టర్ ప్రభుత్వంతో చర్చలు జరిపి వాటాగా రూ.11.60 కోట్లు కేటాయించాలని ప్రతిపాదించారు. వోక్స్ వ్యాగన్‌కు ఇండియాలో అనుబంధ సంస్థగా ఉన్న వశిష్ట వాహన్ సంస్థ పేరు మీద రూ.11.60 కోట్లను విడుదల చేయించారు. డబ్బులు వశిష్ట వాహన్ ఖాతాలో పడగానే ఆ డబ్బులు డ్రా చేసుకొని షుష్టర్ పరారయ్యాడు. ఈ విషయంలో అప్పటి నాటి భారీ పరిశ్రమల మంత్రి బొత్స సత్యనారాయణపై ఆరోపణలు రావడంతో సీబీఐ దర్యాప్తునకు వైఎస్ ఆదేశించారు. బొత్సకు ఎలాంటి సంబంధంలేదని సీబీఐ విచారణ జరిపి తేల్చింది.