బొత్సకు జగన్ క్లాస్ అంటూ చినరాజప్ప కామెంట్స్

రాజమండ్రి, ఆగస్టు 28 (way2newstv.com)
రాజధాని అమరావతి వివాదంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు టీడీపీ నేత నిమ్మకాయల చినరాజప్ప. అమరావతి పనులు కొనసాగిస్తామని చెప్పిన వైఎస్ జగన్ ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. అమరావతి పనులు ఆగవని మంత్రి బొత్స సత్యనారాయణ అసెంబ్లీలో ప్రకటించిన తరువాత బొత్సకు సీఎం జగన్ క్లాస్ తీసుకున్నారని.. అప్పటి నుంచి బొత్స రాజధాని ముంపు ప్రాంతమంటూ కొత్త పల్లవి అందుకున్నారంటూ ఎద్దేవా చేశారు. 
బొత్సకు జగన్ క్లాస్ అంటూ చినరాజప్ప కామెంట్స్

రాజధానిపై చర్చ జరుగుతోందంటూ అయోమయానికి తెరలేపారన్నారు. మెజారిటీ ప్రజలు అమరావతినే రాజధానిగా ఉండాలని కోరుకుంటున్నారని.. ముంపు ప్రాంతం పేరిట రాజధానిని తరలించాలనుకోవడం సరికాదన్నారు. ఏపీ ప్రభుత్వం.. సీఎం జగన్‌పైనా విమర్శలు చేశారు. జగన్ రాష్ట్రాభివృద్ధిని పక్కన పెట్టి చంద్రబాబుపై, టీడీపీ నేతలపై కక్ష సాధింపులపై దృష్టి పెట్టారని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు. రాజధానిపై మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలతో రాజకీయ దుమారం రేగింది. ముంపు ప్రాంతమంటూ రాజధానిని తరలించేందుకే మంత్రులతో ప్రకటనలు చేయిస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇప్పటికే ప్రధాన ప్రతిపక్షం టీడీపీ రాజధాని రైతుల తరఫున పోరాటాలకు సిద్ధమవుతోంది. ఏపీలో రాజకీయంగా బలపడేందుకు వ్యూహాలు రచిస్తున్న బీజేపీ రాజధాని విషయంలో వైఎస్సార్సీపీని టార్గెట్ చేస్తోంది. అటు జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా రాజధాని రైతులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. రెండు రోజుల పాటు రాజధానిలో పర్యటించనున్నట్లు చెప్పారు
Previous Post Next Post