రాణు మోండాల్ కు సల్మాన్ ఖాన్ కళ్లు చెదిరే కానుక! - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

రాణు మోండాల్ కు సల్మాన్ ఖాన్ కళ్లు చెదిరే కానుక!

రూ.55 లక్షల ఖరీదైన ఇళ్ళు గిఫ్ట్ 
బొంబాయి ఆగస్టు,28  (way2newstv.com)
లతా మంగేష్కర్ ను అభిమానించేవాళ్లకు ఆమె పాడిన 'ఏక్ ప్యార్ కా నగ్మా' సాంగ్ ఎంతో ఫేవరెట్ సాంగ్ అనడంలో అతిశయోక్తి లేదు. ఇటీవల అదే పాటను ఓ సామాన్యురాలు రైలు ప్లాట్ ఫామ్ మీద ఆలపించిన వైనం యావత్ భారతదేశాన్ని ఆకట్టుకుంది. లతాజీ తరహాలోనే ఎంతో శ్రావ్యంగా ఆలపించిన ఆ అనామక గాయని పేరు రాణు మోండాల్. 
రాణు మోండాల్ కు సల్మాన్ ఖాన్ కళ్లు చెదిరే కానుక!

రైళ్లలో పాటలు పాడుకునే రాణు ఇప్పుడు సెలబ్రిటీ అయింది. ఆమె పాడిన పాట సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. దాంతో బాలీవుడ్ మ్యూజిక్ డైరక్టర్ హిమేశ్ రేషమ్మియా తన కొత్త చిత్రంలో ఓ పాట కూడా పాడించాడు. ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కూడా రాణు మోండాల్ ప్రతిభకు ముగ్ధుడైపోయాడు. ఆమె గాత్రంతో ఫిదా అయిన భాయ్ ఏకంగా రూ.55 లక్షల విలువ చేసే ఇంటిని కానుకగా ఇచ్చినట్టు బాలీవుడ్ మీడియా పేర్కొంటోంది. అంతేకాదు, తన దబాంగ్-3 సినిమాలో కూడా రాణు మోండాల్ తో ఓ పాట పాడించాలని సల్మాన్ ప్లాన్ చేస్తున్నాడట.