రిజర్వ్ నియోజకవర్గాల్లో ప్రజా ప్రతినిధులు ఉత్సవ్ విగ్రహాలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

రిజర్వ్ నియోజకవర్గాల్లో ప్రజా ప్రతినిధులు ఉత్సవ్ విగ్రహాలు

విజయవాడ, ఆగస్టు 26, (way2newstv.com)
ఎక్కడైనా అంతే.. పార్టీలకతీతంగా ఒకే మార్గం. అదే రిజర్వ్ డ్ నియోజకవర్గాల్లో అగ్రకులాల ఆథిపత్యం. గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనూ రిజర్వ్ డ్ నియోజకవర్గాల్లో అగ్రకులాలకు చెందిన నేతల ఆధిపత్యం చర్చనీయాంశమైంది. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఉత్సవ విగ్రహాలుగానే ఉండిపోతున్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అనేక నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి ఉండేది. కాని వైసీపీ ఇందుకు భిన్నమేదీ కాదని తాజా పరిణామాలతో స్పష్టమయింది.తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో బద్వేలు, కోడుమూరు, పాడేరు, అరకు, రంపచోడవరం వంటి నియోజకవర్గాల్లో అక్కడి తెలుగుదేశం పార్టీకి చెందిన అగ్రకులాలకు చెందిన నేతలదే పెత్తనం. కోడుమూరులో అయితే అప్పటి ఎమ్మెల్యే మణిగాంధీ వైసీపీ నుంచి వచ్చి టీడీపీ లోచేరినా ఆయనకు విలువలేదు. 
 రిజర్వ్ నియోజకవర్గాల్లో ప్రజా ప్రతినిధులు ఉత్సవ్ విగ్రహాలు

అక్కడ విష్ణువర్థన్ రెడ్డిదే పెత్తనమంతా. చివరకు కాంట్రాక్టులు, సిబ్బంది బదిలీలు కూడా ఆయన చెప్పినట్లే నడిచేవి. చివరకు మణిగాంధీ పార్టీ మారి తప్పు చేశానని చెంపలేసుకోవాల్సి వచ్చింది.ఇక రాజధాని అమరావతికి పక్కనే ఉన్న ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఉన్నత ఉద్యోగం చేసి రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యే అయిన రావెల కిశోర్ బాబును మంత్రి పదవి నుంచి తప్పించేంతవరకూ అగ్రకులనేతలు నిద్రపోలేదు. ఇక్కడ రావెల ఎమ్మెల్యే అయినా తాము చెప్పినట్లే నడుచుకునే వారు. దీంతో ఆత్మాభిమానం దెబ్బతినిందని రావెల కిశోర్ బాబు బయటకు వచ్చేశారు. అప్పట్లో అన్ని ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు అవమానాల పాలవుతున్నారని వైసీపీ కూడా బహిరంగంగానే ఆరోపించింది తాజాగా నందికొట్కూరు నియోజకవర్గంలోనూ వైసీపీ నేత తీరు ఇలానే ఉంది. అక్కడ వైసీపీ ఇన్ ఛార్జి సిద్ధార్ధరెడ్డికి, ఎమ్మెల్యే ఆర్థర్ కు పొసగడం లేదు. సిద్ధార్థరెడ్డి చెప్పినట్లే పనులు జరుగుతున్నాయని ఎమ్మెల్యే ఆవేదన చెందుతున్నారట. ఇద్దరూ కలసి పార్టీ సమావేశాలు కూడా హాజరుకావడం లేదు. బదిలీల్లోనూ సిద్ధార్థరెడ్డిదే పైచేయి కావడంతో ఎమ్మెల్యే పార్టీ అగ్రనాయకత్వం ముందు వాపోయారట. మొత్తం మీద వైసీపీలో కూడా ఇందులో మాత్రం టీడీపీకి తీసిపోలేదన్నది మాత్రం వాస్తవం.