హైద్రాబాద్, సెప్టెంబర్ 11, (way2newstv.com)
ఖైరతాబాద్ వినాయకుడిని ఈ నెల 12న మధ్యాహ్నం ఒంటి గంటకల్లా నిమజ్జనం చేయనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఉదయం పదకొండు గంటలకు మండపం నుంచి తీసిమధ్యాహ్నం 12లోగా ఎన్టీఆర్ మార్గ్‌కి చేర్చుతామని చెప్పారు. ఈ భారీ విగ్రహం పూర్తిగా నీటిలో మునిగే విధంగా హుస్సేన్‌సాగర్‌లో 20అడుగులమేరకు పూడిక తొలగించినట్లు పేర్కొన్నారు.మంగళవారం మంత్రి తలసాని ఎన్టీఆర్ మార్గ్‌లోని ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్‌లో నిమజ్జన ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.నగరంలో సుమారు 55,000 గణేశ్ప్రతిమలను ఏర్పాటుచేయగా, గడచిన నాలుగు రోజుల్లో 3600 మినహా మిగిలినవన్నీ నిమజ్జనం జరిగినట్లు పేర్కొన్నారు. మిగిలిన విగ్రహాలను చివరిరోజు 12న నిమజ్జనం చేస్తున్నట్లు తెలిపారు.
మధ్యాహ్నం 1 గంటకే ఖైరతాబాద్ గణపతి నిమజ్జనం
హుస్సేన్‌సాగర్ కాకుండా 26 కొలనులను సిద్ధంచేయడంతోపాటు 28 క్రేన్లను ఏర్పాటు చేశామన్నారు. మొహర్రం పండుగ సందర్భంగా కర్బలా మైదానంలో తగిన ఏర్పాట్లు చేసినట్లు మంత్రితలసాని వివరించారు. బాలాపూర్ వినాయకుడికి నిమజ్జనం ఉదయం ఐదు గంటలకు పూజలు ముగించుకొని ఆరు గంటలకు బాలాపూర్ పురవీధుల గుండా తొమ్మిది గంటలకు బొడ్రాయి దగ్గరకుచేరుకుంటుందని వినాయక ఉత్సవ సమితి అధ్యక్షుడు కళ్లెం నీరంజన్‌రెడ్డి మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో వెల్లడించారు. తొమ్మిదిన్నరకు బాలాపూర్ వినాయకుని లడ్డూవేలం పాటమొదలు అవుతుందన్నారు. వేలంలో పాల్గొన్నాలనుకున్న వారు రూ.1000 డిపాజిట్ చేసుకోవాలన్నారు12 సెంటర్లలో నిమజ్జనం, 391 కిలోమీటర్ల శోభాయాత్రగణేశ్ నిమజ్జన కార్యక్రమానికి విస్తృత ఏర్పాట్లు చేసినట్లు మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. నగరంలోని 32 ప్రాంతాల్లో జరిగే నిమజ్జన కార్యక్రమానికి రూ.20 కోట్ల వ్యయంతో ఏర్పాట్లు చేసినట్లుపేర్కొన్నారు. శోభాయాత్ర 391కిలోమీటర్లు జరుగనుండగా, ప్రతి మూడు కిలోమీటర్లకు ఒకటి చొప్పున 194 గణేశ్ యాక్షన్ టీమ్‌ల ఏర్పాటు.పారిశుధ్య కార్యక్రమాలకు 481 మంది సూపర్‌వైజర్లు, 719 మంది ఎస్‌ఎఫ్‌ఏలు, 9849 మంది పారిశుధ్య కార్మికుల నియామకం.ఒక్కో టీమ్‌లో ఒక శానిటరీ సూపర్‌వైజర్ లేక శానిటరీ జవాన్, ముగ్గురు ఎస్‌ఎఫ్‌ఏలు, 21 మంది పారిశుధ్య కార్మికులు మూడు షిఫ్టులుగా పనిచేస్తారు.నిమజ్జన ప్రాంతాల్లో 27 ప్రత్యేక వైద్యశిబిరాలు, 92 మొబైల్ టాయిలెట్లు.
జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో 32ప్రాంతాల్లో 93 స్టాటిక్ క్రేన్‌లు, 134 మొబైల్ క్రేన్‌ల ఏర్పాటు.
నిమజ్జనానికి శుభ్రమైన నీటితో 23 కొలనుల ఏర్పాటు.రూ.9.29 కోట్లతో రోడ్ల మరమ్మతులు, రీకార్పెటింగ్, గుంతలు పూడ్చివేత తదితర పనులు.
మొత్తం 176పనులకు మంజూరీ.
నిమజ్జనం జరిగే చెరువులవద్ద గజ ఈతగాళ్ల నియామకం.
రూ.99.41లక్షల వ్యయంతో 36,674 తాత్కాలిక లైటింగ్ ఏర్పాటు.
శోభాయాత్ర మార్గాల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లడం.
నిమజ్జనం పూర్తయిన వెంటనే విగ్రహాలను తొలగించడం.
రోడ్లు, భవనాల శాఖ ఆధ్వర్యంలో 12 కిలోమీటర్లమేర బారికేడింగ్, 75 జనరేటర్ల ఏర్పాటు.
శోభాయాత్ర మార్గంలో 15 కేంద్రాల్లో వాటర్‌ప్రూఫ్ టెంట్‌ల ఏర్పాటు
హుస్సేన్‌సాగర్‌లో వ్యర్థాల తొలగింపునకు హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో 1000మంది నియామకం.
వాటర్‌బోర్డు ఆధ్వర్యంలో 115 శిబిరాల ద్వారా పంపిణీకి వాటర్ ప్యాకెట్లు
శోభాయాత్ర మార్గాల్లో 36 ఫైర్ ఇంజన్ల ఏర్పాటు.
సరూర్‌నగర్, కాప్రా, ప్రగతినగర్ తదితర చెరువుల వద్ద ప్రత్యేకంగా మూడు బోట్లు ఏర్పాటు.
పర్యాటకశాఖ ద్వారా హుస్సేన్‌సాగర్‌లో ఏడు బోట్లు, నాలుగు స్పీడ్ బోట్లు ఏర్పాటు. పదిమంది గజ ఈతగాళ్ల నియామకం.
విద్యుత్‌శాఖ ఆధ్వర్యంలో హుస్సేన్‌సాగర్ చుట్టూ 48విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు. సరూర్‌నగర్ చెరువు వద్ద మరో ఐదు ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు.
నగరంలోని ఇతర ప్రాంతాల్లో 101 అదనపు ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు.