ద‌సరా సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 5న విడుద‌ల‌వుతున్న న‌వీన్ విజ‌య్ విజ‌య్ కృష్ణ `ఊరంతా అనుకుంటున్నారు` - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ద‌సరా సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 5న విడుద‌ల‌వుతున్న న‌వీన్ విజ‌య్ విజ‌య్ కృష్ణ `ఊరంతా అనుకుంటున్నారు`

(way2newstv.com)    
`నందిని నర్సింగ్ హోమ్` చిత్రంతో కథానాయకుడిగానే మంచి గుర్తింపు తెచ్చుకొన్న నవీన్ విజయ్ కృష్ణ హీరోగా బాలాజీ సానల దర్శకత్వంలో రోవాస్కైర్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్స్‌పై శ్రీహరిమంగళంపల్లి, రమ్య గోగుల, పి.ఎల్.ఎన్. రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం `ఊరంతా అనుకుంటున్నారు`. సెన్సార్ కార్య‌క్ర‌మాన్ని పూర్తి చేసుకుని ఈ చిత్రం క్లీన్ `యు` స‌ర్టిఫికేట్‌ను పొందిన ఈ చిత్రాన్ని ద‌స‌రా సంద‌ర్బంగా అక్టోబ‌ర్ 5న  విడుద‌ల చేస్తున్నారు. 
ద‌సరా సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 5న విడుద‌ల‌వుతున్న న‌వీన్ విజ‌య్ విజ‌య్ కృష్ణ `ఊరంతా అనుకుంటున్నారు`

ఈ సంద‌ర్భంగా ...చిత్ర నిర్మాతలు‌ మాట్లాడుతూ ``మా `ఊరంతా అనుకుంటున్నారు` చిత్రంవిందు భోజ‌నంలాంటి సినిమా. సినిమా చూసిన ప్రేక్ష‌కుల‌కు మంచి ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ చూశామ‌ని గ్యారంటీగా ఫీల్అవుతారు. కె.రాధాకృష్ణ‌గారి అద్భుత‌మైన సంగీతం, జి.ఎల్‌.ఎన్‌.బాబు బ్యూటీఫుల్ విజువ‌ల్స్‌, సున్నితమైన ఫ్యామిలీ కామెడీతో పాటు జయసుధ- రావు రమేష్ ల మధ్య, నవీన్ విజయకృష్ణ -శ్రీనివాస్ అవసరాల మధ్య సన్నివేశాలు భావోద్వేగాన్ని కలిగించేలా దర్శకుడు బాలాజీ సానల చిత్రీకరించారు. ఈ పండ‌గలాంటి సినిమాను ద‌స‌రా సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 5న విడుద‌ల చేస్తున్నాం``అన్నారు.న‌టీన‌టులు:  నవీన్ విజయకృష్ణ    శ్రీనివాస్ అవసరాల మేఘా చౌదరి సోఫియా సింగ్ జయసుధ