ప్రైవేటు కంపెనీ నందు ఉద్యోగాల కొరకు ఆసక్తి గల వారు దరఖాస్తు చేసుకోవాలి - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ప్రైవేటు కంపెనీ నందు ఉద్యోగాల కొరకు ఆసక్తి గల వారు దరఖాస్తు చేసుకోవాలి

జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన
పెద్దపల్లి   సెప్టెంబర్ 24  (way2newstv.com)
ప్రైవేటు కంపెనీల నందు ఉద్యోగ అవకాశాల కొరకు ఆసక్తి గల వారు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ శ్రీ దేవసేన మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పెద్దపల్లి జిల్లా మరియు కరీంనగర్జిల్లాలో నిరుద్యోగ యువతీ యువకులకు ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు కల్పించడం 
 ప్రైవేటు కంపెనీ నందు ఉద్యోగాల కొరకు ఆసక్తి గల వారు దరఖాస్తు చేసుకోవాలి

సెప్టెంబర్ 27 శుక్రవారం ప్రభుత్వ ఐటిఐ క్యాంపస్ బస్టాండ్ దగ్గర జిల్లా ఉపాధి కార్యాలయంలో ప్రైవేటు కంపెనీల్లోహైదరాబాద్ , కరీంనగర్ గోదావరిఖని నందు పని చేయుటకు ఆసక్తిగల వారు హాజరుకావాలని ,అభ్యర్థులు ఎస్ఎస్సి, ఇంటర్ ,డిగ్రీ చదివి ఉండాలని ఎంపిక కాబడిన వారికి 6500 నుండి 12500వరకు వేతనం ఇవ్వబడుతుందని, అర్హత గల నిరుద్యోగ యువతీ యువకులు తమ బయోడేటా విద్యార్హతల జిరాక్స్ కాఫీలతో ప్రభుత్వ ఐఐటి క్యాంపస్ లో ఉన్న జిల్లా ఉపాధి కార్యాలయం నందుసెప్టెంబర్ 27న ఉదయం 11 గంటలకు హాజరుకావాలని ఇతర వివరముల కొరకు 9885824326, 9502642441నంబర్లను సంప్రదించాలని ప్రకటనలో పేర్కొన్నారు.