హైద్రాబాద్, సెప్టెంబర్ 4, (way2newstv.com)
తెలంగాణలో పాగా వేయాలన్న లక్ష్యంతో అడుగులు వేస్తున్న కమలదళం వైపు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలో పలువురు నేతలు అడుగులు వేస్తున్నారు. మోడీ హవాలో కుదేలైన కాంగ్రెస్ పార్టీ సమీప భవిష్యత్తులో కోలుకోవడం కష్టమన్న భావనలో వున్న కాంగ్రెస్‌తో పాటు టిడిపి, టిజెఎస్, ఇతర పార్టీలకు చెందిన చాలా మంది నేతలు కమలదళంలో చేరడానికి ఉత్సాహం చూపుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్బావానికి పూర్వం రంగారెడ్డి జిల్లాలో పటిష్టంగా ఉన్న తెలుగుదేశం పార్టీ అనంతర పరిణామాలలో నేతలు, క్యాడర్ అంతా సైకిల్ దిగి కారు ఎక్కినా అక్కడక్కడ ఒకరిద్దరు నేతలు ఇంకా పార్టీలో మిగిలారు.తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి భవిష్యత్ లేదని గ్రహించిన నేతలు ఇక సైకిల్ దిగి కమలం పార్టీలో చేరడానికి సిద్ధమవుతున్నారు..
హస్తాన్ని టార్గెట్ చేసిన కమలం...
రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలోని శివారు నియోజకవర్గాలలో కొంత వరకు పట్టున్న నేతలంతా ముకూమ్మడిగా సైకిల్ దిగి కమలం గూటికి చేరనుండటంతో టిడిపి దుకాణం బంద్ అయిపోయింది. టిడిపిలో కొనసాగుతున్న మాజీ మంత్రి, మాజీ రాజ్యసభ సభ్యుడు దేవేందర్ గౌడ్ ఆయన తనయుడు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు వీరేందర్ గౌడ్ సైతం సమీప కాలంలోనే టిడిపి వదిలి బిజెపిలో చేరడం ఖాయమని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది.ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పట్టున్న కాంగ్రెస్ నేతలను తమ వైపుకు తిప్పుకోవడానికి కమలదళం నేతలు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే జిల్లా కాంగ్రెస్‌కు పెద్ద దిక్కుగా ఉన్న మాజీ ఎంపి ఇంటికి బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి నేరుగా వెళ్లి చర్చలు జరిపినట్లు ప్రచారం జరుగుతుంది. ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలను బిజెపిలోకి తీసుకువచ్చేందుకు బడానేత పావులు కదుపుతున్నారు. సెప్టెంబర్‌లో నిర్వహిస్తున్న సమావేశంలో అమిత్‌షా సమక్షంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన పెద్ద నేతలు చాలామంది కమలం గూటికి చేరడం ఖాయంగా కనిపిస్తుంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాపై ప్రత్యేకంగా కన్నెసిన కమలదళంలో అంతర్గతంగా పెద్ద ఎత్తున ఆపరేషన్ ఆకర్ష్ నిర్వహిస్తుంది.
Tags:
telangananews