కొనసాగుతున్న రొట్టెల పండుగ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

కొనసాగుతున్న రొట్టెల పండుగ

నెల్లూరు, సెప్టెంబర్ 10(way2newstv.com)
నెల్లూరులోని బారాషహీద్‌ దర్గా, పవిత్ర స్వర్ణాల చెరువులో జరిగే రొట్టెల పండుగకు ఎంతో ప్రాధాన్యత ఉంది. మొహర్రం సందర్భంగా బారా షహీదులకు ప్రార్థనలు నిర్వహించి, తమ కోరికలు నెరవేరాలనిరొట్టెలను ఇచ్చిపుచ్చుకుంటారు. రొట్టెలు తీసుకున్న వారు వాటిని తిని వచ్చే ఏడాది మళ్లీ దర్గాకు వచ్చి అలాంటి కోరికలు తీరాలనుకునే వారికి వరాల రొట్టెలు పంచుతారు. ప్రపంచ శాంతి కోసం వచ్చినెల్లూరులో అమరులైన 12 మంది త్యాగాలను స్మరించుకుంటూ మొహర్రం మాసంలో రొట్టెల పండుగను జరుపుకోవడం అనవాయితీ.దర్గా పక్కన ఉన్న స్వర్ణాల చెరువు వద్ద జరిగే ఈ వేడుకకులమతాలకు అతీతంగా జరగడమే దీని ప్రత్యేకత. ఇక్కడ అంతా ఒక్కటై ఒకరికొకరు రొట్టెలు పంచుకుంటారు. 
కొనసాగుతున్న రొట్టెల పండుగ

రోగాలు నయమవుతాయని, వివాహ, ఉద్యోగ, సంతానం, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయనినమ్ముతారు. గతేడాది కోర్కెలు ఫలించిన వారి రొట్టెల కోసం ఈ ఏడాది ఎంతో మంది బారులు తీరుతారు. ఐదు రోజులపాటు జరిగే ఈ పండుగ మంగళవారం షహదత్‌ (సొందల్‌ మాలి)తోప్రారంభమవుతుంది. ప్రధాన ఘట్టం బారాషహీదుల గంధ మహోత్సవం బుధవారం అర్ధరాత్రి జరగుతుంది. కోటమిట్టలోని అమినియా మసీదు నుంచి 12 బిందెల్లో గంధాన్ని దర్గాకు తీసుకువచ్చి,ప్రార్థనలు నిర్వహించి బారా షహీదులకు లేపనం చేస్తారు. శుక్రవారం తహలీల్‌ ఫాతెహా, శనివారం ముగింపు సభను నిర్వహించనున్నారు.మహ్మద్‌ ప్రవక్త సందేశాన్ని ప్రపంచానికి అందజేయడంలో12 మంది మతబోధకులు టర్కీ నుంచి భారతదేశానికి వచ్చారు. ఆ సమయంలో కొడవలూరు మండలంలోని గండవరంలో తమిళనాడు వాల్జా రాజులకు, బీజాపూర్‌ సుల్తాన్‌లకు మధ్య పవిత్రయుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో టర్కీ కమాండర్, మత ప్రచారకుడు జుల్ఫేఖార్‌ బేగ్‌తో పాటు 11 మంది వీర మరణం పొందారు.వారి తలలు గండవరంలో తెగి పడగా మొండాలను గుర్రాలునెల్లూరులోని స్వర్ణాల చెరువు వద్దకు తీసుకువచ్చాయి. వీరమరణం పొందిన 12 మంది నెల్లూరు ఖ్వాజీకి కలలో కనపడి తమను అక్కడే సమాధి చేయాలని కోరడంతో అక్కడే వీరికి సమాధులునిర్మించారు. 12 సంఖ్యను ఉర్దూలో బారా, వీర మరణం పొందిన అమరులను ఉర్దూలో షహీద్‌లుగా పిలువబడతారు. అందుకే ఈ దర్గాకు బారాషహీద్‌ అనే పేరొచ్చింది.బారాషహీద్‌ దర్గా రొట్టెలపండుగకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తుల దర్శనం కోసం బారికేడ్లను ఏర్పాటు చేశారు. అమరులను దర్శనం చేసుకుని ఫాతెహాలు చేస్తారు. అనంతరం దర్గా ప్రాంగణంలోనే ఉన్నఅహమ్మద్‌ బాబా, అమ్మాజీ తదితర దర్గాలను దర్శించుకుంటారు. మొహర్రం నెల పదో రోజు నుంచి దర్గాలో ఐదు రోజుల పాటు జరిగే రొట్టెల పండుగకు ఈ ఏడాది సుమారు 15 లక్షల మందికి పైగాభక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు.ఏపీ, తెలంగాణతో పాటు కర్ణాటక, తమిళనాడు, ఒడిశా, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండాఅన్ని ఏర్పాట్లు చేశారు. చెరువు గట్టుపై జల్లుస్నానాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని, మహిళలు దుస్తులు మార్చుకునేందుకు గదులు, తాత్కాలిక మరుగుదొడ్ల సౌకర్యం కల్పించామని అధికారులుతెలిపారు.