నులిపై నిర్లక్ష్యం (పశ్చిమగోదావరి) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

నులిపై నిర్లక్ష్యం (పశ్చిమగోదావరి)

ఏలూరు, సెప్టెంబర్ 13 (way2newstv.com): 
ఆశయం ఉన్నతంగా ఉన్నప్పుడు ఆచరణ సర్వోన్నతంగా ఉంటేనే ఫలితం గొప్పగా ఉంటుంది. నులి పురుగుల నివారణకు మాత్రలు పంపిణీ చేయాలనే లక్ష్యంఉన్నతమైనదే. అమలు చేయడానికి మాత్రం ప్రభుత్వం, అధికారులు ఆపసోపాలు పడుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం కావచ్ఛు. పాలకుల నిర్లిప్తత కావచ్ఛు. కారణం ఏదైనా జిల్లాలో నులి పురుగులనివారణ మాత్రల పంపిణీ కార్యక్రమం బాలారిష్టాలను దాటేలా కనిపించడం లేదు. ఇప్పటి వరకు పట్టుమని 20 శాతం మాత్రలను కూడా పంపిణీ చేయలేదంటే పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో అర్థమవుతుంది. 
నులిపై నిర్లక్ష్యం (పశ్చిమగోదావరి)

వైద్యశాఖ అధికారులు మాత్రం రేపుమాపంటూ కాలం గడిపేస్తున్నారు. చిన్నారులు నులి పురుగుల సమస్యతో అవస్థలు పడుతున్నారు. వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఏటాజిల్లాలోని ఒకటి నుంచి 18 ఏళ్లలోపు ఉన్న పిల్లలకు ఉచితంగా నులి పురుగు నివారణ మాత్రలు (ఆల్బెండజోల్‌) పంపిణీ చేయాల్సి ఉంది. ఏటా ఫిబ్రవరి 10, ఆగస్టు 10న అన్ని పాఠశాలలు,కళాశాలల్లో పంపిణీ చేస్తారు. ఈ ఏడాది మాత్రం ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యం నెరవేరలేదు. ఆగస్టు 10న నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులకు మొక్కుబడిగాపంపిణీ చేశారు. నెలాఖరులోగా మాత్రలు పూర్తిస్థాయిలో వస్తాయని.. తర్వాత పంపిణీ చేస్తామని వైద్యాధికారులు చేతులు దులుపుకొన్నారు. నేటికీి పాఠశాలల్లో విద్యార్థులకు నులి పురుగులమాత్రలు అందలేదు. జిల్లావ్యాప్తంగా అల్బెండజోల్‌ మాత్రలు నిండుకున్నాయి. కనీసం ప్రభుత్వ ఆసుపత్రుల్లో సైతం వీటి జాడ లేదంటే అతిశయోక్తి కాదు.జిల్లాలో నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ నామమాత్రంగానే జరిగింది. ఇప్పటివరకు ఏలూరు, పెదపాడు, పెదవేగి, దెందులూరు, భీమడోలు, ద్వారకాతిరుమల మండలాల్లోని పీహెచ్‌సీలపరిధిలో వీటిని పంపిణీ చేశారు. ఏలూరు నగర పాలక సంస్థతోపాటు కేవలం 11 పీహెచ్‌సీల్లో మాత్రమే మాత్రల పంపిణీ జరిగింది. జిల్లాలో 8.8 లక్షల మాత్రలు పంపిణీ చేయాల్సి ఉండగా.. కేవలం1.5 లక్షలు మాత్రమే పంపిణీ చేశారు. ఇంకా 7.3 లక్షలు పంపిణీ చేయాలి. తాజాగా 3.5 లక్షలు వచ్చినా వీటిని విద్యార్థులకు పంపిణీ చేయలేదు. అనుకున్న సమయానికే మాత్రలన్నీ వచ్చినానాణ్యత లేకపోవడం వల్లే పంపిణీ చేయకుండా వెనక్కి పంపారని వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి.నులి పురుగుల్లో మూడు రకాలు ఉన్నాయి. ఏలిక పాములు (అస్కారిస్‌ లుంబ్రికాయిడ్స్‌), చుట్టపు పాములు (టీనియా సోలియాం), కొంకి పురుగులు (అంకై లో స్టొమాడియోడెనేల్‌) అనేరకాలుంటాయి. ఇవి కడుపులో 17 మీటర్ల పొడవు పెరుగుతాయి. వీటి గుడ్లు మట్టిలో సుమారు 10 ఏళ్లపాటు జీవించే ఉంటాయి. చిన్నారులు మట్టిలో ఆడుకునే సమయంలో వారి పాదాల ద్వారాకడుపులోకి ప్రవేశిస్తాయి. సరిగ్గా ఉడికించని పంది, పశు మాంసం ద్వారా కూడా మనిషిలోకి ఇవి ప్రవేశిస్తాయి. ఏటా రెండు సార్లు నులిపురుగుల నివారణ మాత్రలు తప్పనిసరిగా వాడి తీరాలి.ముఖ్యంగా 1 నుంచి 18 సంవత్సరాల పిల్లలకు వాడకుంటే రక్తహీనత, పోషకాహార లోపం, ఆకలి మందగించడం, తరచూ కడుపులో నొప్పి, అతిసారంతోపాటు చర్మవ్యాధులు ఎక్కువగా ప్రబలుతాయి.ముఖ్యంగా 18ఏళ్లలోపున్న గర్భిణులకు వీటివల్ల రక్తహీనత వస్తుంది.