పోలీసులకు వీక్లీఆఫ్పై త్వరలోనే నిర్ణయం: కేసీఆర్

హైదరాబాద్ సెప్టెంబర్ 19 (way2newstv.com)
పోలీసులకు వీక్లీఆఫ్‌పై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ఎటువంటి విపత్తులనైనా ఎదుర్కోవడానికి కమాండ్ కంట్రోల్ సెంటర్ ఉపయోగపడుతుందనివివరించారు.హోంగార్డులకు మనం ఇస్తున్న వేతనం దేశంలో ఎక్కడా ఇవ్వడం లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. 
పోలీసులకు వీక్లీఆఫ్పై త్వరలోనే నిర్ణయం: కేసీఆర్

శాసనసభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ముఖ్యమంత్రి సమాధానం ఇస్తూ...దేశంలో ఏ నగరానికి లేని భవిష్యత్తు హైదరాబాద్ నగరానికి ఉంది. హైదరాబాద్‌కు ఆరు వైపుల హెలిప్యాడ్స్ కూడిన సెంటర్స్ అవసరం ఉంది. తెలంగాణ పోలీసులు అద్భుతంగా పనిచేస్తున్నారు.మనం సుఖంగా నిద్రపోతున్నామంటే అందుకు పోలీసులే కారణమన్నారు.
Previous Post Next Post