నోటి దురుసుతో అచ్చెన్నాయుడు... - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

నోటి దురుసుతో అచ్చెన్నాయుడు...

శ్రీకాకుళం, సెప్టెంబర్ 14, (way2newstv.com)
శ్రీకాకుళం జిలాకు చెందిన టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు వైఖరి మొదటి నుంచి అలాగే ఉందన్న విమర్శలు ఉన్నాయి. ఆయన అన్న స్వర్గీయ కింజరపు ఎర్రన్నాయుడు సౌమ్యునిగా, మంచి వక్తగా పేరు తెచ్చుకున్నారు. అసలు కింజరపు కుటుంబంలో రాజకీయ రంగప్రవేశం చేసి రాష్ట్ర జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్న నాయకుడుగా ఎర్రన్నను చెప్పుకుంటారు. ఆయన సొంతంగా తనకు తానుగా ఎదిగిన తీరు అందరినీ ఆకట్టుకుంది కూడా. ఎక్కడో మారుమూల శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చి ఢిల్లీ స్థాయిలో తన వాణిని వినిపించిన ఎర్రన్నాయుడు రాజకీయం ఎంతోమందికి స్పూర్తిగా ఉందంటే అనుమానం లేదు. 
నోటి దురుసుతో అచ్చెన్నాయుడు...

ఎర్రన్నాయుడు 1996 లో పార్లమెంట్ కి వెళ్ళినపుడు ఆయన తన వారసునిగా తమ్ముడు అచ్చెన్నాయుడిని అసెంబ్లీ బరిలోకి దింపారు. అలా రాజకీయ అరంగేట్రం చేసి గెలిచిన అచ్చెన్నాయుడు మొదటి నుంచి దురుసుగానే ఉంటారని పేరు. ఆయనకు విపరీతమైన కోపం. ఎంత పడితే అంతలా మాటనేస్తారు. అసెంబ్లీలో జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నపుడు అచ్చెన్నాయుడు వాడిన భాష ఇప్పటికీ చెప్పుకుంటారంటే ఆయన వైఖరి ఏంటో తెలుస్తుంది.అచ్చెన్నాయుడు సుదీర్ఘ కాలం ప్రతిపక్షంలో ఉన్నారు. 2014లో ఎమ్మెల్యే కావడంతోనే మంత్రి అయ్యారు. ఎర్రన్నాయుడు కుటుంబానికి బాబు ఇచ్చిన గౌరవానికి దక్కిన ఫలితమది. మరి ఎర్రన్న వారసునిగా అచ్చెన్నాయుడు మంత్రిగా రాణించారా అంటే లేదేనే చెప్పాలి, ప్రతీ వారిని దగ్గరగా తీసుకుని తన పర తేడా లేకుండా మంచి సాధించిన ఎర్రన్న రాజకీయం వేరు.అచ్చెన్నాయుడు ఆది నుంచి వివాదాస్పదునిగా పేరు సంపాదించారు. మంత్రి పదవి రావడంతో ఒక్కసారిగా రెచ్చిపోయి విమర్శలు చేయడమే కాదు, శ్రీకాకుళం జిల్లాలో కూడా దూకుడుగా వెళ్లాలని అంటారు. దాని వల్లనే తాజా ఎన్నికల్లో శ్రీకాకుళంలో పార్టీ ఘోరంగా దెబ్బతినిందంటారు. ఇక పార్టీ ఓడినా సిక్కోలులో లోపాయికారీ రాజకీయం మూలంగా అచ్చెన్నాయుడు నెగ్గారు. మరి మాజీ మంత్రిగా, బాధ్యత గల ప్రతిపక్ష నేతగా ఆయన వ్యవహరించిన తీరు ఇంతేనా అంటే నిరాశే కలుగుతుంది.అచ్చెన్నాయుడు మంత్రిగా ఉన్నపుడు మందీ మార్బలం, పోలీస్ బలగం అంతా వెంట వుండేది. మరి ఆ పోలీసులే ఇపుడూ ఉన్నారు. అధికారం వైసీపీది అయ్యేసరికి పోలీసులనే దూషించేటంతగా అచ్చెన్నాయుడు దూకుడు సాగిందంటే బాధాకరమే. మంత్రిగా తన వెంట ఉన్నపుడు మంచి వారు, ఇపుడు లా అండ్ ఆర్డర్ చూస్తూ ఆగాలని కోరినపుడు మాత్రం చెడ్డవారు. అంతేనా అచ్చెన్నాయుడు తన నోటితోనే పోలీసులను యూజ్ లెస్ ఫెలోస్ అనేశారు. చిన్న అధికారులను కాదు, ఐపీఎస్ అధికారులనే అలా అనేస్తే ఇక ఏమైనా ఉందా, మంత్రిగా పనిచేసి పదిమందికీ ఆదర్శంగా నిలబడాల్సిన అచ్చెన్నాయుడు పోలీసులను అలా అనడం ద్వారా వారి స్థాయి తగ్గించలేదు, తనకు తానే తగ్గారనిపించుకున్నారు. మరి టీడీపీలో నంబర్ టూ గా ఉంటున్న అచ్చెన్నాయుడు ఇదే వైఖరితో ఉంటే అది ఆయనకే కాదు, పార్టీకి కూడా నష్టమే. మరి ఆయన మారాలి. లేదా బాబు అయినా దారికి తేవాలి. ఇదే బాగుందని టీడీపీ అనుకుంటే మాత్రం ఇబ్బందులు తప్పవేమో.