విజయవాడలో అడ్డగోలుగా నిర్మాణాలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

విజయవాడలో అడ్డగోలుగా నిర్మాణాలు

విజయవాడ, సెప్టెంబర్ 14, (way2newstv.com)
అనుమతి పొందేది ఓ విధమైన భవనానికైతే నిర్మాణం జరిగేది మరో రకమైన నిర్మాణం.. అనుమతులు రాని ప్రాంతాలు, భవనాలకు కార్పొరేషన్‌ పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు అనధికారికంగాఅనుమతులు ఇచ్చేస్తున్నారు. నివాసయోగ్యమైన భవనాల అనుమతి పొందుతూ వ్యాపార వాణిజ్య నిర్మాణాలు చేస్తున్నా.. జీ ప్లస్‌1కి అనుమతి పొంది.. జీ ప్లస్‌ ఐదు ఫ్లోర్లు వేస్తున్నారని ఫిర్యాదుచేసిన అధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఒక్కో ఫ్లోర్‌ నిర్మాణాలకు క్షేత్రస్థాయి సిబ్బంది నుంచి ఉన్నతస్థాయి అధికారి వరకు లక్షల్లో వసూలుకుపాల్పడుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. నగర పాలక సంస్థలో ప్రతి సోమవారం జరుగుతున్న స్పందన కార్యక్రమంలో, ప్రతి శుక్రవారం జరుగుతున్న ఓపెన్‌ ఫోరంలో అనధికారిక నిర్మాణాలపైఫిర్యాదులు వస్తున్నా అధికారులు ఆయా ఫిర్యాదులను బుట్టదాఖలు చేస్తున్నారని విమర్శలు ఉన్నాయి.
 విజయవాడలో అడ్డగోలుగా నిర్మాణాలు

హనుమాన్‌పేటలో ఏలూరులాకులకు వెళ్లే మార్గంలో అనధికారిక ఫ్లోర్ల వ్యవహారం వెలుగులోకివచ్చింది. స్టిల్టు, గ్రౌండ్‌ ఫ్లస్‌ రెండు ఫ్లోర్లకు మాత్రమే అనుమతి ఉన్న భవనంపై గతంలో అనధికారికంగా నిర్మాణం జరుగుతుంటే సంబంధిత అధికారులు వెళ్లి భవన నిర్మాణాన్ని నిలుపుదల చేయటమేకాకుండా అక్రమకట్టడాన్ని కూల్చివేశారు. నిబంధనల మేరకు ప్లాను పొందిన తర్వాత మాత్రమే భవనం పునఃనిర్మాణం చేపట్టాల్సి ఉండగా వీఎంసీలోని ఓ కీలక అధికారి చక్రం తిప్పి అదనపుఅంతస్తులు వేయటానికి లక్షల్లో బేరం కుదుర్చుకున్నారు. రెసిడెన్షియల్‌ విభాగంలో పాత ప్లాను పొందిన భవనం కమర్షియల్‌ వినియోగాలకు అనువుగా నిర్మాణాలు జరుగుతున్నాయని, దీనివల్లకార్పొరేషన్‌కు సమకూరాల్సిన ఆదాయం కూడా అధికారులు తమ జేబులో వేసుకుంటున్నారని ఆరోపణలు. మరో నిర్మాణంలో పూర్తిగా నిబంధనలనేవి కేవలం పత్రాలకే పరిమితం అన్నట్లువ్యవహరించారని విమర్శ. గాంధీనగర్‌లోని సాంబమూర్తి రోడ్డులోని డీమార్టు వద్ద అతి కొద్ది స్థలంలో భారీ భవనానికి అనధికారికంగా అనుమతులు ఇచ్చేశారు. రెసిడెన్షియల్‌ విభాగంలో జీ ఫ్లస్‌–1మాత్రమే అనుమతి ఉన్న ఈ భవనానికి అధికారుల చలవతో జీ ఫ్లస్‌–4 స్లాబులు వేయటంతోపాటు పార్కింగ్‌కు కేటాయించాల్సిన ప్రాంతాన్ని వ్యాపార వినియోగాలకు అనువుగా దుకాణసముదాయాలను నిర్మిస్తున్నారని కార్పొరేషన్‌ 103కి పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు తమకు పట్టనట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. నిబంధనల మేరకు కార్పొరేషన్‌కుభవన నిర్మాణ అనుమతులకు చలానా రూపంలో స్థలం, నిర్మాణం జరిగే ప్రాంతానికి, యూజీడీ కనెక్షన్లకు, తాగునీటికి, నిర్మాణ వ్యర్థాల తొలగింపు వంటి తదితర అంశాల్లో చలానా రూపంలో నగదుచెల్లించి అనుమతి పొందాల్సి ఉంటుంది. అనధికారిక నిర్మాణాల వల్ల ఇటు కార్పొరేషన్‌కు సమకూరాల్సిన ఆదాయం అధికారుల జేబుల్లోకి వెళ్తున్నాయని ఆరోపణలు వస్తున్నాయి