గొంతెండుతోంది - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

గొంతెండుతోంది

అనంతపురం, సెప్టెంబర్ 17, (way2newstv.com)
.అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని' చందంగా ఈ రోజు రాష్ట్రంలోని జలాశయాలన్నీ దాదాపు నిండినా కరువు ప్రాంతాల ప్రజలు మాత్రం నీరు దొరక్క అల్లాడి పోతున్నారు. రాష్ట్రంలో ఉన్న జలాశయాలన్నీ నిండితే 771 టిఎంసీల నీరు లభ్యమవుతుంది. గత సంవత్సరం 189 టిఎంసీలు మాత్రమే చేరగా ఈ సంవత్సరం ఇప్పటి వరకు 579 టిఎంసీలు చేరాయి. దాదాపు 400 టిఎంసీలు అదనంగా వచ్చాయి. తెలంగాణ వాటాతో సహా అన్ని అవసరాలు పోనూ శ్రీశైలం జలాశయంలో 120 టిఎంసీలు వెనకబడిన ప్రాంతాలకు మళ్ళించే అవకాశం వుంది. స్వజల్‌ పథకం నుంచి విశాఖ, కడప జిల్లాలను పక్కన పెట్టేశారు. ఒక్క విజయనగరం జిల్లాకే పరిమితం చేయడంతో జిల్లా ఆర్‌డబ్లూఎస్‌ అధికారుల్లో నిరుత్సాహం నెలకొంది కానీ పాలకుల దృష్టి లోపం వల్ల నేడు రాయలసీమ ప్రజలు మరోసారి కరువు బారిన పడ్డారు.
గొంతెండుతోంది

దేశంలో పైలెట్‌ ప్రాజెక్టు కింద 2018 ఫిబ్రవరిలో బిహార్‌, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల్లోని వెనుకబడిన జిల్లాల్లో స్వజల్‌ పథకాన్ని అమలు చేసి మంచి ఫలితాలనే సాధించారు. దీంతో నీతి ఆయోగ్‌ సారథ్యంలో కేంద్ర గ్రామీణ నీటిసరఫరా, పారిశుద్ధ్య మంత్రిత్వ శాఖ ఈ పథకాన్ని దేశవ్యాప్తంగా 115 జిల్లాలో అమలు చేయాలని తొలుత నిర్ణయించింది. ఈ క్రమంలోనే. మన రాష్ట్రంలో కడప, విజయనగరం, విశాఖ జిల్లాలకు చోటు కల్పించారు. దీనికి సంబంధించి ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులతో అవగాహనా.. సంసిద్ధతా కార్యక్రమాలను చేపట్టారు. తాగునీటి పథకాలు లేని ఆవాసాలన్నింటినీ గుర్తించి అంచనాలు తయారు చేశారు. మహారాష్ట్రలోని పుణెలో స్వజల్‌ పథకం అమలుతీరుపై అవగాహన కోసం ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ రవికుమార్‌ వెళ్లారు. అక్కడే కేంద్ర ప్రభుత్వ అధికారులు తీరిగ్గా, ‘మీ జిల్లాకు మొదటి విడతలో చోటు లేదు.. రెండో విడతలో మిగతా జిల్లాలతో పాటు స్వజËల్‌లో చేర్చుతామ’ని చెప్పారు. దీంతో ఉత్తచేతులతో తిరుగుముఖం పట్టాల్సివచ్చింది.స్వజల్‌ పథకం వర్తించాలంటే ముందుగా ఆ పల్లె ఓడీఎఫ్‌గా ప్రకటించి ఉండాలి. అలాగే ఆ గ్రామంలో ఇప్పటి వరకు తాగునీటి పథకం ఉండకూడదు. చేతి బోర్లపైనే తాగునీటికి ఆధారపడుతుండాలి. అలాంటి గ్రామాలకే కేంద్ర ప్రభుత్వం స్వజల్‌ పథకం ద్వారా రక్షిత నీటి పథకాలను నిర్మించడానికి నిధులు మంజూరు చేస్తుంది. అయితే పంచాయతీ వాటాగా 10 శాతం ధనం చెల్లించాలి. మిగతా 90 శాతం నిధుల్లో 45:45 కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తాయి. 14వ ఆర్థిక సంఘం నిధులు పంచాయతీల్లో దండిగా ఉండడంతో 10 శాతం వాటా చెల్లింపు పెద్ద కష్టమేమీ కాదని ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు అంచనా వేశారు. ఈ ఊపులోనే అన్ని గ్రామాల్లోనూ రక్షిత నీటి పథకాలు నిర్మించుకోవచ్చని ఆశించారు. దీనికోసం జిల్లా మొత్తంగా 2,581 గ్రామాల్లో తాగునీటి కోసం చేతిబోర్లపైనే ఆధారపడుతున్నాయని నివేదిక సిద్ధం చేశారు. మైదాన ప్రాంతంలో 322 గ్రామాల్లో, మన్యంలో 2,259 ఆవాసాల్లో రక్షిత నీటి పథకాలు లేవని తేల్చారు. ఆయా గ్రామాల్లో చిన్న, మధ్యస్త నీటి పథకాలు నిర్మించడానికి సుమారు రూ.100 కోట్లుపైనే అవసరం అవుతాయని ప్రతిపాదించారు. ఎక్కువగా సౌర నీటి పంపులు.. గ్రావిటీ నీటి పథకాలు నిర్మించి అందుబాటులోకి తెస్తే సరిపోతుందని భావించారు. అంతా సిద్ధం చేసుకున్నాక స్వజల్‌ నుంచి తప్పించడంతో ఈ ప్రతిపాదనలన్ని బుట్టదాఖలయ్యే పరిస్థితి నెలకొంది.త సంవత్సరం ఇదే సమయానికి నాగార్జున సాగర్‌లో 115 టిఎంసీల నీళ్ళు నిల్వ వున్నాయి. కానీ ఇప్పుడు 306 టిఎంసీలు ఉన్నాయి. సాగర్‌ లోకి 7,400 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతున్నది. మరో 6 టిఎంసీలు వస్తే రిజర్వాయర్‌ నిండిపోతున్నది. కానీ యథావిధిగా సాగర్‌ ఆయకట్టుకు ఆలస్యంగా నీళ్ళు వదిలారు. సాగర్‌ పరిధిలోని కాలువ చివరి భూముల రైతులు ఇప్పటికీ నిరాశలోనే వున్నారు. ప్రకాశం జిల్లాలో నాలుగు రోజులకు ఒకసారి మంచినీరు వదులుతున్నారు. గుండ్లకమ్మ రిజర్వాయరు పూర్తయినా దాన్నొక పర్యాటక ప్రాంతంగా మార్చారే తప్ప పంట కాల్వలు పూర్తి చేసి నీరివ్వడం లేదు. 80 వేలు సాగవ్వాల్సి ఉండగా కేవలం వంద, రెండు వందల ఎకరాలకు మాత్రమే నీరందుతున్నాయి. ఇక్కడ సాగర్‌ నుండి గుండ్లకమ్మకు, గుండ్లకమ్మ నుండి మూసీ నదికి అనుసంధానం చేస్తే ప్రకాశం జిల్లాలోని కాలువ చివరి భూములు, వెనుకబడిన ప్రాంతాలకు నీరందుతుంది. కనీసం భూగర్భ జలాలు పెరిగి బోర్ల కింద సేద్యం చేసుకోగలుగుతారు. కనీసం పంటలు ఎండి పోకుండానైనా కాపాడుకోగలుగుతారు. వాడకానికి, తాగడానికి నీళ్ళు వుంటాయి. వెలుగొండ రిజర్వాయరు పూర్తయినా సొరంగాలు పెండింగ్‌లో ఉండటం వలన నిరుపయోగమవుతున్నది. ప్రఖ్యాతిగాంచిన రాళ్ళపాడు ప్రాజెక్టు గత నాలుగేళ్ళుగా ఎండిపోయి వుంది. తెలుగు గంగ ద్వారా కృష్ణా జలాలు, సోమశిల ప్రాజెక్టులో ప్రవేశిస్తాయి. అక్కడి నుండి రెండున్నర టిఎంసీలు రాళ్ళపాడు ప్రాజెక్టుకు మళ్ళిస్తే 25 లక్షల ఎకరాలకు నీరందుతుంది. సాగర్‌ నుండి మూసీ నది లోని నీరు వదిలితే అటూ ఇటూ గ్రామాల్లో లిఫ్టుల ద్వారా సాగుచేయవచ్చు. అలాగే సోమశిల నుండి కండలేరు మీదుగా చెన్నైకు వెళ్ళే కాలువ నుండి చిత్తూరు జిల్లాకు నీరందించవచ్చు.సాగర్‌ దిగువన ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే ఉపయోగపడే పులిచింతల ప్రాజెక్టు నిర్మాణం పూర్తయింది. కృష్ణా డెల్టా స్థిరీకరణకు ఉద్దేశించిన ప్రాజెక్టు ఇది. దీని పూర్తి నిల్వ సామర్థ్యం 45 టిఎంసీలు. ఇప్పటి వరకు 15 టిఎంసీలున్నాయి. గత సంవత్సరం ఇదే సమయానికి 7 టిఎంసీలు మాత్రమే ఉన్నాయి. పట్టిసీమ నుండి ప్రకాశం బ్యారేజికి 100 టిఎంసీల నీరు పంపింగ్‌ అవుతోంది. సాగర్‌ నుండి 20 టిఎంసీలు ఇస్తే కృష్ణా డెల్టాలో పూర్తి సామర్థ్యంతో పంటలు పండించవచ్చు. తద్వారా కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాలకు ఉపయోగం జరుగుతున్నది. ఆ రీత్యా కృష్ణా డెల్టాకు నష్టం జరగకుండానే శ్రీశైలం, సాగర్‌ జలాశయాలన్నింటినీ పూర్తిగా వెనుకబడిన ప్రాంతాలకు కేటాయించవచ్చు