పాలమూరులో నిమజ్జన ఏర్పాట్లు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

పాలమూరులో నిమజ్జన ఏర్పాట్లు

మహబూబ్ నగర్  సెప్టెంబర్ 11, (way2newstv.com)
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో గణేష్ నిమజ్జనోత్సవాలకు  మంత్రి  వి శ్రీనివాస్ గౌడ్ బుధవారం ఉదయం అంకురార్పణ చేశారు. గణనాథుల నిమజ్జనోత్సవాన్నీ  భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని గణేశ్ఉత్సవసమితి బాధ్యులను కోరారు. జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ వద్ద బాలగంగాధర్  విగ్రహానికి పూజలు నిర్వహించి ఓమ్ ధ్వజారోహణం కావించారు. 
పాలమూరులో నిమజ్జన ఏర్పాట్లు

సాయంత్రం నిమజ్జన శోభాయాత్రనుసంప్రదాయమైన భజనలు, కోలాటాల మధ్య జరుపుకోవాలని, గడియారం చౌరస్తాలో వేదిక దగ్గర సాయంత్రం 5 గంటల నుంచి రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో 150 మంది కళాకారులు సాంస్కృతికకార్యక్రమాలు నిర్వహిస్తారని వెల్లడించారు. బీచుపల్లిలో నిమజ్జనం చేసేందుకు ప్రభుత్వం తరఫున మున్సిపల్ ప్రాంగణంలో లారీలను సిద్ధంగా ఉంచనున్నట్లు తెలిపారు. వినాయక యువజనసంఘాలు భక్తిశ్రద్ధలతో పర్వదినాన్ని జరుపుకోవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో గణేశ్ ఉత్సవ సమితి అధ్యక్షుడు మనోహర్ రెడ్డి మద్ది యాదిరెడ్డి బాలయ్య, లక్ష్మణ్, అంజయ్య, రాంచంద్రయ్య,హన్మంతు,చేరుకుపల్లి రాజేశ్వర్,కురువరాములు, మాల్యాద్రి, పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.