అమరావతి సెప్టెంబర్ 16 (way2newstv.com)
ఏపీ మాజీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు చనిపోయేంతవరకు వైసీపీ ప్రభుత్వం వెంటాడి వేధించిందని టీడీపీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. కోడెల మెడపై గాట్లు ఉన్నాయని, ఆత్మహత్యగా భావిస్తున్నామని ఆయన అన్నారు. కోడెల బాధ్యతలు నిర్వహించిన బసవతారకం ఆస్పత్రిలోనే.. మృతిచెందడం బాధాకరమని సోమిరెడ్డి విచారం వ్యక్తం చేశారు.
కోడెల మెడపై గాట్లు ఉన్నాయి..: సోమిరెడ్డి