మార్పు దిశగా యూత్ (ఆదిలాబాద్) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

మార్పు దిశగా యూత్ (ఆదిలాబాద్)

ఆదిలాబాద్, సెప్టెంబర్ 10 (way2newstv.com): 
యువతలో సామాజిక మార్పు తీసుకువచ్చి వారిని స్వయం ఉపాధి దిశగా అడుగులు వేసేలా వారికి ఉపాధి అవకాశాలు కల్పించడం, వారు సమాజసేవకు పాటుపడేలా యూత్‌క్లబ్‌ల ఏర్పాటు లక్ష్యంతో ప్రభుత్వం నాలుగేళ్ల కిందట యువచేతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. చదువుతో పాటు యువత సామాజిక కార్యక్రమాల్లో పాలుపంచుకునేలా యువజనులకు చేయూతనిచ్చే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిది. ఇందుకోసం జిల్లా యువజన సర్వీసుల శాఖ ద్వారా 15 నుంచి 35 ఏళ్లలోపు యువతీ, యువకులతో యూత్‌ క్లబ్‌లు ఏర్పాటు చేసేలా నిర్ణయించింది. సామా జిక కార్యక్రమాల్లో భాగస్వాములయ్యేందుకు ముందుకు వచ్చే యువతకు చేయూతనిచ్చి వారిని అన్ని విధాలా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చేపట్టిన యువచేతన కార్యక్రమం జిల్లాలో నీరుగారి పోతోంది. 
మార్పు దిశగా యూత్ (ఆదిలాబాద్)

నాలుగేళ్లలో జిల్లా లో సుమారు 566 యూత్‌క్లబ్‌లు ఏర్పాటు కాగా వాటిలో దాదాపు 9వేలకుపైగా యువత సామాజిక కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నారు. వారికి ప్రభుత్వ పరంగా ఎలాంటి స్వయం ఉపాధి రుణాలు, ప్రోత్సాహకాలు అందకుండా పోతున్నాయి. దీంతో పథక ఉద్దేశం నీరుగారిపోతోంది. మహిళా స్వయం సహాయక సంఘాల మాదిరిగానే ఒక్కో యూత్‌ క్లబ్‌లో 10 నుంచి 15 మంది యువజనులు ఉండేలా గ్రామస్థాయిలో యువజన క్లబ్‌లు ఏర్పాటు చేసుకున్నారు. ఒకరు ఆర్గనైజర్‌ లేదా అధ్యక్షుడిగా, డిప్యూటీ ఆర్గనైజర్‌ లేదా సెక్రెటరీగా జిల్లాలో దాదాపు 566 యూ త్‌క్లబ్‌లను ఏర్పాటు చేశారు. యూత్‌ క్లబ్‌లకు ప్రభుత్వం చేయూత ఇవ్వడంతోపాటు భవిష్యత్‌లో ఉపాధి అవకాశాలకు రుణ సదుపాయం కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకునేందుకు వాటిని ఏర్పాటు చేశారు. కానీ లక్ష్యం నెరవేరకపోవడంతో అవి కేవలం యూత్‌క్లబ్‌లుగానే మిగిలిపోయాయి. యూత్‌క్లబ్‌లో 10 నుంచి 15 మంది సభ్యులుగా ఏర్పాటైన యువత ప్రధానంగా వారి నివాస ప్రాంతాల్లో ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటడం, వార్డు ప్రజలను ప్రోత్సహించడం చేయాలి. అంతేకాకుండా పాఠశాలకు వెళ్లని చిన్నారులను గుర్తించి వారి తల్లిదండ్రులతో చర్చించి వెంటనే చిన్నారులను పాఠశాలలో చేర్పించాలి. పరిసరాలన్నీ శుభ్రంగా ఉండేలా శ్రమదాన కార్యక్రమాలు చేపట్టాలి. జాతీయ పండగలను నిర్వహించి జాతీయ సమైక్యత చాటేలా పాలుపంచుకోవాలి. యువజనులంతా సేవాకార్యక్రమాలు చేపట్టాలి. క్రీడాపోటీల నిర్వహణ, అవయవదానం ప్రాధాన్యతను ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలి. క్రమం తప్పకుండా రక్తదాన శిబిరాలు నిర్వహించాలి. మండల స్థాయిలో కార్యకలాపాలు కొనసాగించాలి. జిల్లాలో ఇదివరకే యువజన సర్వీసులశాఖ ద్వారా 13 మండలాల పరిధిలో మొత్తం 566 యూత్‌ క్లబ్‌లు ఏర్పాటయ్యాయి. కొత్తగా యూత్‌క్లబ్‌లు ఏర్పాటు చేయాలంటే మొదట గ్రామాల్లోని వార్డుల వారీగా ఆసక్తి గల యువత యూత్‌ క్లబ్‌లను ఏర్పాటు చేసుకునేందుకు దరఖాస్తులను మొదట పంచాయతీ సెక్రెటరీకి అందజేయాలి. అక్కడి నుంచి ఆయా దరఖాస్తులు ఈఓపీఆర్‌డీ ద్వారా సంబంధిత మండలాల ఎంపీడీఓ జిల్లా యువజన క్రీడాశాఖకు అందజేయాల్సి ఉంటుంది. కొత్తగా యూత్‌క్లబ్‌ల ఏర్పాటుకు ఎలాంటి గడువు లేదు. ఎప్పుడైనా యువత యూత్‌క్లబ్‌లను ఏర్పాటు చేసుకోవచ్చు.