దసరా తర్వాతే టీ కేబినెట్.... - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

దసరా తర్వాతే టీ కేబినెట్....

హైద్రాబాద్, సెప్టెంబర్ 4, (way2newstv.com)
తెలంగాణలో మంత్రి వర్గ విస్తరణ ఎప్పుడు..? ఈసారి బెర్తులు దక్కేదెవరికి.... కేటీఆర్‌, హరీష్ రావులకు చోటు దక్కుతుందా...? మంత్రి వర్గ విస్తరణకు బడ్జెట్ సమావేశాలు, పండుగలు అడ్డంకులుగా మారాయా...? ఆశావహులంతా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న మంత్రి వర్గ విస్తరణ దసరా తర్వాత ఉండే అవకాశం ఉంది. గవర్నర్ బదిలీ కావడం, బడ్జెట్ సమావేశాలు, బతుకమ్మ పండుగ వరుసగా వస్తుండటంతో పండగ తర్వాత విస్తరణ చేపట్టాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. మంత్రి వర్గంలో ఎవరెవరికి చోటు కల్పించాలన్న దానిపై కేసీఆర్ ఇప్పటికే కసరత్తు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. అయితే శాసన సభ బడ్జెట్ సమావేశాలు ఈనెల 9 నుంచి ప్రారంభమై మూడు వారాల పాటు కొనసాగనున్నాయి. మరోవైపు నర్సింహన్ స్థానంలో గవర్నర్‌గా తమిళిసైని కేంద్రం నియించింది. 
దసరా తర్వాతే టీ కేబినెట్....

ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాల్లోగా మంత్రివర్గ విస్తరణ ఉండకపోవచ్చని పార్టీ వర్గాలంటున్నాయి. కేటీఆర్ కొత్త మంత్రి వర్గ విస్తరణలో మరో ఆరుగురికి బెర్త్‌ దక్కనున్నట్లు తెలుస్తోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తోపాటు మాజీ మంత్రి హరీష్ రావు‌కు తిరిగి మంత్రివర్గంలో చోటు కల్పించడంపై టీఆర్‌ఎస్‌లో చర్చ జరుగుతోంది. దసరా తర్వాత జరిగే మంత్రి వర్గ విస్తరణలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీలు గుత్తా సుఖేందర్ రెడ్డి, సత్యవతి రాథోడ్‌కు బెర్తులు ఖాయమైనట్లు తెలుస్తోంది. కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌ కు కేబినెట్ హోదాలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్ష పదవి అప్పగించారు. అదే సామాజిక వర్గం నుంచి ఇప్పటికే సీఎం కేసీఆర్‌తో పాటు ఎర్రబెల్లి దయాకర్ రావు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే హరీశ్ ‌రావుకు చోటు కల్పించకుండా తాను ఒక్కడినే మంత్రి వర్గంలో చేరితే విమర్శలు వస్తాయన్న కేటీఆర్ భావిస్తున్నట్లు తెలిసింది. కూకట్‌పల్లి కార్యకర్తల సమావేశంలో కేటీఆర్‌ను మళ్లీ మంత్రిగా ఉండాలని కోరుకుంటున్నట్లు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. మరోసారి మంత్రులుగా కేటీఆర్, హరీశ్ రావు సెక్రటేరియట్‌లో అడుగుపెడుతారా...? వారికి అవకాశం ఇవ్వబోతున్నారా అన్న విషయాలు తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.