నిర్మల్ ప్రతినిధి,సెప్టెంబర్ 16 (way2newstv.com)
సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల విభాగంలో పాల్గొని జిల్లాలోని వివిధ ప్రాంతాలోని బాధితులు హాజరై సమస్యలను వివరించి అర్జీలు అందజేశారు. వారి సమస్యలను తెలుసుకొని వెంటనే సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్ ద్వారా బాధితుల సమస్యలను తెలియజేసి వెంటనే చర్యలు తీసుకొని పూర్తి దర్యాప్తు చేసిన నివేదిక అందించ్లని ఆదేశించారు.
పోలీసులు ప్రజలకు జవాబుదారిగా ఉండాలి
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సి.శశిధర్ రాజు గారు మాట్లాడుతూ ప్రతి పోలీసు స్టేషన్ లో ప్రజా పిర్యాదుల విబాగంలో తాగునీటి సౌకర్యం ఉన్నాయని, పోలీసు స్టేషన్ లో పిర్యాదు చేయడానికి వచ్చే బాదితులకు ఆప్యాయంగా పలకరించి ముందుగా తాగునీరు అందించాలని సుచించారు. రాత్రి సమయంలో గస్తీతో పటు పెట్రోలింగ్, వాహనాలను తనిఖీలు చేస్తూ చురుకుగా పని చేయాలన్నారు, పోలీసులు ప్రజలకు జవాబుదారిగా ఉండాలని ఎస్పీ అన్నారు. కాలనీల్లో అనుమానాస్పదంగా వ్యక్తులు సంచరించినట్లయితే సంబదిత పోలీసు స్టేషన్ ఎస్.ఐ.లేద సి.ఐ.ల ఫోన్ చేయాలి లేదా జిల్లా వాట్సప్ నెం.8333986939కు సమాచారం తెలియజేయాలని కోరారు. పోలీసులు ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటారని ప్రజలకు సేవ చేయడంలో నిర్మల్ పోలీసులు ముందుంటారని భరోసా ఇచ్చారు.