గవర్నర్ ను కలిసిన టీడీపీ బృందం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

గవర్నర్ ను కలిసిన టీడీపీ బృందం

వైకాపా దాడులపై ఫిర్యాదు
విజయవాడ సెప్టెంబర్ 19  (way2newstv.com)
రాజ్ భవన్ లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను గురువారం  తెలుగుదేశం పార్టీ నేతల బృందం కలిసింది. ఈ సందర్బంగా వైసిపి ప్రభుత్వం మూడు నెలల పాలనలో  జరుగుతున్న దాడులు,   మాజీ స్పీకర్ కోడెల ఆత్మహత్యకు గల కారణాలు , ప్రభుత్వ వేధింపులపై ఫిర్యాదు చేసిరు. టిడిపి నేతలు,కార్యకర్తలు పై అక్రమ కేసులు వంటి వాటి పై గవర్నర్ కు వివరించారు.  
గవర్నర్ ను కలిసిన టీడీపీ బృందం

కోడెల ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై విచారణ చేపట్టాలని చంద్రబాబు గవర్నర్కు విజ్ఞప్తి చేశారు. పార్టీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారంటూ చంద్రబాబు గవర్నర్కు ఫిర్యాదు చేశారు. కోడెల ఆత్మహత్యకు వైసీపీ సర్కార్ వేధింపులే కారణమని ఆరోపించారు. కోడెలపై అక్రమ కేసులు పెట్టి వేధించారని ఫిర్యాదు చేశారు. అట్రాసిటీ కేసులు పెట్టడంపైనా ఫిర్యాదు చేశారు.గవర్నర్ ని కలిసిన వారిలో లో టిడిపి అధినేత చంద్రబాబు, నారా లోకేష్, కళా వెంకట్రావు,  నిమ్మకాయల చినరాజప్ప, దేవినేని ఉమ,బుద్దా వెంకన్న,  అశోక్ బాబు, నిమ్మల రామానాయుడు,  కరణం బలరాం, అచ్చెం నాయుడు, నక్కా ఆనంద్ బాబు, వర్ల రామయ్య , యలమంచిలి రాజేంద్రప్రసాద్,  ఇతర నాయకులు వున్నారు.