నేపాల్ అంతర్జాతీయ కబాడ్డి పోటీలకు వెళ్లేందుకు ఆర్థిక సహాయం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

నేపాల్ అంతర్జాతీయ కబాడ్డి పోటీలకు వెళ్లేందుకు ఆర్థిక సహాయం

బీజేపీ యువనేత మిథున్ రెడ్డి ద్వారా విక్రమ్ రెడ్డి రూ.30 వేల ఆర్థిక సహాయం
షాద్ నగర్ సెప్టెంబర్ 19, (way2newstv.com)
అండర్ 17 తో పాటు, అండర్-19 అంతర్జాతీయ కబడ్డీ పోటీలకు ఎంపికైన రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం చౌదరిగుడా మండలము కాసుల బాద్ గ్రామానికి చెందిన శ్రీకాంత్ నాయక్, రాఘవేందర్, పెద్ద ఎల్కిచర్లకు చెందిన వివేకానందరెడ్డిలు ఎన్నికయ్యారు. ఇటీవల జరిగిన పాండిచ్చేరి కబడ్డీ పోటీలలో రాణించిన ఈ విద్యార్థులను నేపాల్ అంతర్జాతీయ కబడ్డీ పోటీలకు ఎంపిక చేశారు. ఆర్థిక రీత్యా నేపాల్ పోటీలకు వెళ్లడానికి కొంత ఆర్థిక ఇబ్బందులు ఏర్పడిన క్రమంలో మండల సింగిల్విండో చైర్మన్ పి. వెంకటేశ్వర్ రెడ్డి చొరవతో నేపాల్ వెళ్లడానికి ఆర్థిక సహాయం సమకూర్చారు. ఈ విషయాన్ని బిజెపి యువనేత ఏపీ మిథున్ రెడ్డి దృష్టికి వెంకటేశ్వర్ రెడ్డి తీసుకువెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించారు. 
నేపాల్ అంతర్జాతీయ కబాడ్డి పోటీలకు వెళ్లేందుకు  ఆర్థిక సహాయం

ఈరోజు గురువారం హైదరాబాద్లోని నందగిరి హిల్స్ లోని మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి  స్వగృహంలో మిథున్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా  సదరు క్రీడాకారులకు సంబంధించిన ఆర్థిక పరిస్థితులపై స్పందించి వెంకటేశ్వర్ రెడ్డి సమక్షంలో వారికి ఆర్థిక సహాయం ప్రకటించారు. మిథున్ రెడ్డి స్నేహితుడు విక్రంరెడ్డి ద్వారా ముగ్గురు క్రీడాకారులకు నేపాల్ వెళ్లడానికి ఆర్థిక సహాయం చేశారు. ఒక్కో క్రీడాకారునికి 10 వేల రూపాయల చొప్పున మొత్తం 30 వేల రూపాయలను వారికి మిథున్ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ఎంతో నైపుణ్యం ఉండి గ్రామీణ క్రీడల్లో రాణిస్తూ ఇలా అంతర్జాతీయ స్థాయికి ఎదిగే విద్యార్థులకు మిథున్ రెడ్డి ప్రోత్సాహం అందజేయడం విశేషం అని కొనియాడారు. తాను అడిగిన వెంటనే వారికి ఆర్థిక సహాయం చేసేందుకు ఒప్పుకున్న మిథున్ రెడ్డి మరియు ఆయన మిత్రులు విక్రం రెడ్డికి వెంకటేశ్వర్రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మిథున్ రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ క్రీడాకారులకు ప్రతిభ ఉంటే ప్రోత్సహించడం తన ధర్మమని, వెంకటేశ్వర్ రెడ్డి తమ దృష్టికి తీసుకు వచ్చిన ఈ విషయాన్ని సానుకూలంగా స్పందించి తన మిత్రుడు విక్రం రెడ్డి ద్వారా ఆర్థిక సహకారం అందించడానికి ముందుకు వచ్చినట్టు తెలిపారు. క్రీడాకారులు మరింత రాణించాలని ఉజ్వల భవిష్యత్తుకు పట్టుదలతో కృషి చేయాలని ఆయన సూచించారు.