నెల్లూరు జిల్లాల్లో వైసీపీలో కుమ్ములాటలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

నెల్లూరు జిల్లాల్లో వైసీపీలో కుమ్ములాటలు

నెల్లూరు, అక్టోబర్ 30, (way2newstv.com)
నెల్లూరు జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజీకీయాలు ఏమాత్రం బాగాలేవు. చూడటానికి, వినడానికి పది మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు ఉన్నారన్న మాటే గాని తెలుగుదేశం పార్టీ కంటే ఘోరంగా వర్గ విభేదాలు చోటు చేసుకున్నాయి. ఏ ఎమ్మెల్యేలకు మరో ఎమ్మెల్యే అంటే పడదు. పేరుకు అందరూ సీనియర్లే. రాజకీయ అనుభవం ఉన్నవారే. ఎన్నో ఎన్నికల్లో ఓటమిని, గెలుపును చూసిన వారే కానీ ఈసారి మాత్రం వారు అగ్రనేతలు చెప్పినా కుదరదు పో అంటున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే నెల్లూరు జిల్లాలో వచ్చే ఎన్నికల నాటికి జీరోకు పడిపోయే అవకాశముంది.వారిద్దరూ పదవులు ఆశించలేదు. ఊహించనూ లేదు. కానీ వారిద్దరికీ మంత్రిపదవులు వచ్చాయి. 
నెల్లూరు జిల్లాల్లో వైసీపీలో కుమ్ములాటలు

అనిల్ కుమార్ యాదవ్, మేకపాటి గౌతమ్ రెడ్డిలకు తన మంత్రివర్గంల జగన్ చోటు కల్పించారు. సాదాసీదా శాఖలేమీ వీరికి ఇవ్వలేదు. ఒకరికి నీటి పారుదల శాఖ, మరొకరికి పారిశ్రామిక రంగాన్ని అప్పగించారు. శాఖల కేటాయింపు జరిగిన వెంటనే నెల్లూరు జిల్లాకు మహర్దశ పడుతుందని వైసీపీ క్యాడర్ తో పాటు ప్రజలు కూడా ఆశీర్వదించారు. అయితే ఈ మంత్రులిద్దరినీ ఇప్పటి వరకూ ఏ ఎమ్మెల్యే తమ నియోజకవర్గాలకు ఆహ్వానించలేదు.సాధారణంగా మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే ఎదురేగి స్వాగతం పలుకుతారు. కానీ అనిల్ కుమార్ యాదవ్ కు ఒక్క కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాత్రమే స్వాగతం చెప్పారు. ఇక మేకపాటి గౌతం రెడ్డికి అయితే ఆత్మకూరు ప్రజలు తప్ప ఏ నేతా స్వాగతం చెప్పలేదు. తమకంటే జూనియర్లు అనుకున్నారో? లేక వారి వద్దకు తాము ఎందుకు వెళ్లాలనుకుంటున్నారో తెలియదు కాని జిల్లాలోని పది మందిలో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు వీరి వద్దకు వెళ్లడం లేదు. వీరు ఏకాకులుగా మారారు. రాష్ట్ర వ్యాప్తంగా వీరిద్దరినీ తమ నియోజకవర్గాల్లో పర్యటించాల్సిందిగా వైసీపీ ఎమ్మెల్యేలు ఆహ్వానం పలుకుతుంటే నెల్లూరు జిల్లా ఎమ్మెల్యేలు మాత్రం తమ నియోజకవర్గాల్లో నో ఎంట్రీ అంటున్నారు. ఇంతవరకూ వీరిద్దరూ నెల్లూరు జిల్లాలోని తమ నియోజకవర్గాలు మినహాయించి మిగిలిన ప్రాంతాలకు వెళ్లింది లేదు.ఇటీవల కాకాణి గోవర్థన్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి మధ్య విభేదాలు తలెత్తినా అధిష్టానం రంగంలోకి సర్దుబాటు చేసే ప్రయత్నం చేసింది. అయినా సరే ఎమ్మెల్యేలందరూ ఒక చోట కూర్చుని పార్టీ కోసం చర్చించిన దాఖలాలు ఇప్పటి వరకయితే లేవు. అంతదాకా ఎందుకు? అమరావతికి వచ్చిన నెల్లూరు జిల్లా ఎమ్మెల్యేలు అనిల్ కుమార్ యాదవ్, గౌతంరెడ్డి ఛాంబర్లను మినహాయించి అందరి వద్దకు వెళుతున్నారు. తమ నియోజకవర్గ పనులు చేయించుకుంటున్నారు. ఇలా నెల్లూరు జిల్లాలోని ఇద్దరు మంత్రులను వైసీపీ ఎమ్మెల్యేలు వెలివేశారనే చెప్పక తప్పదు. వైసీపీ అధినేత జగన్ నేరుగా రంగంలోకి దిగితే తప్ప నెల్లూరు జిల్లాలో కలహాలకు కాలం చెల్లదన్నది వైసీపీ క్యాడర్ అభిప్రాయం.