కొంప ముంచిన కొత్త విత్తనాలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

కొంప ముంచిన కొత్త విత్తనాలు

గుంటూరు, అక్టోబరు 30, (way2newstv.com)
వ్యవసాయ కళాశాల క్షేత్రం అధికారుల నిర్లక్ష్యం రైతుల పాలిట శాపంలా మారింది. వ్యవసాయ కళాశాల క్షేత్రం నుంచి ఈ ఏడాది మే చివరి, జూన్‌ మొదటి వారాల్లో రైతులకు బీపీˆటీ-5204 సాంబా మసూరి రకం 80 వేల కిలోలు, బీపీటీ-2270 భావపురి సన్నాలు రకం 54 వేల కిలోలు విక్రయించారు. విత్తనాలు ప్యాక్‌ చేసే సమయంలో మారిపోయాయి. సాంబామసూరి రకం పేరుతో ముద్రించిన బస్తాల్లో భావపురి సన్నాలు, భావపురి సన్నాల పేరుతో ముద్రించిన బస్తాల్లో సాంబా మసూరి రకం వచ్చి చేరాయి. ఈ పొరపాటు గమనించని అధికారులు రైతులకు అమ్మారు. ఈ కేంద్రంలో బీపీటీ-5201, బీపీటీ- 2270 రకాల విత్తనాలు కొనుగోలు చేసి పంట సాగు చేయటం ద్వారా తాము నష్టపోయామని రైతులు రోజుకో ప్రాంతం నుంచి వస్తున్నారు.
కొంప ముంచిన కొత్త విత్తనాలు

బాపట్ల మండలం నరసాయపాలెం, కంకటపాలెం, చెరువుజమ్ములపాలెం, ప్రకాశం జిల్లా కారంచేడు, స్వర్ణ గ్రామాల్లో 1500 ఎకరాల్లో భావపురి సన్నాలు బదులుగా సాంబా మసూరి వేయటంతో ఇతర రైతుల పొలాల్లో కన్నా ముందుగా చిగురు వచ్చింది. ఈ ప్రాంతంలో పంట పదిహేను రోజులు ముందుగా వస్తుంది. ఇక్కడి నేలలకు ఈ రకం అనువు కాదు. పొలంలో నీరు నిలబడి ఉంటుంది. దీనివల్ల 40 శాతానికి పైగా దిగుబడులు తక్కువగా వచ్చే పరిస్థితి ఏర్పడింది. మొత్తమ్మీద రెండు ప్రాంతాల్లో రైతులు రూ.250 కోట్లకుపైగా నష్టపోనున్నారు. బాపట్ల, కర్లపాలెం మండలాలతోపాటు ప్రకాశం జిల్లా కారంచేడు, స్వర్ణ ప్రాంత అన్నదాతలు ఆందోళనకు దిగారు. ఏడీ లోకనాథరెడ్డి, మేనేజర్‌ ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. పరిహారం అందించి  ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. విత్తనాలు మారిపోవటంవల్ల నష్టం వాటిల్లినట్లు   తెలుస్తోంది. ఈ సమస్యపై అధ్యయనానికి నియమితులైన శాస్త్రవేత్తల కమిటీ విచారణ పూర్తి చేసి ప్రాథమిక నివేదికను వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉన్నతాధికారులకు సోమవారం అందజేసింది.డెల్టాలో ఏడాదికి రెండు పంటలు పండించే ప్రాంతాల్లో 145 రోజులకు పంట వచ్చే బీపీటీ-5204, ఒకే పంట వేసే బాపట్ల, చీరాల సబ్‌ డివిజన్లలోని 20 వేల ఎకరాల్లో సగం విస్తీర్ణంలో 160 రోజులకు పంట వచ్చే బీపీటీ-5204 సాగు చేస్తున్నారు. అయితే, విత్తనాలు మారిపోవటంతో సమస్య వచ్చింది. వేరే చోట నుంచి విత్తనాలు తీసుకొచ్చి సాగు చేసిన రైతుల పొలాల్లో మాత్రం పైరు చిగురుకు వచ్చి ఈనింది. వేర్వేరు రకాలు కావటం వల్ల ఎరువుల చల్లే సమయంలో మార్పు ఉంటుంది. ఇది తెలియని అన్నదాతలు చిగురు రాలేదని అధికంగా ఎరువులు చల్లారు. అధికారుల తప్పిదంతో వీరు రెండో పంట కోల్పోతున్నారు.