గుంటూరు అక్టోబర్ 23(way2newstv.com)
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ పాలన జనరంజకంగా సాగుతోంది సీఎం జగన్కు 100కు 150 మార్కులు వేస్తా. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో ట్రావెల్స్ బస్సులు ఉన్నా.. సీఎం జగన్కు నా బస్సులే కనిపిస్తున్నాయని మాజీ ఎంపీ టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. ఇప్పటివరకు నా ట్రావెల్స్కు చెందిన 31బస్సులను సీజ్ చేశారు.
నా బస్సులే కనపడుతున్నాయి
దీనిపై న్యాయపోరాటం చేస్తాను . తన బస్సులనే భూతద్దంలో చూసి సీజ్ చేశారు. జరిమానాలతో పోయే తప్పిదాలకు సీజ్ చేయడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. జగన్ అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ మ అబ్బాయే. పరిపాలనలో జగన్ కిందామీదా పడుతున్నాడని అయన వ్యాఖ్యానించారు.