మహబూబ్ నగర్ అక్టోబరు 7, (way2newstv.com)
చిన్నాంబావి మండలం అయ్యవారిపల్లి, చెల్లాపాడు, పెద్దమారుర్, కొప్పునూర్ గ్రామాలలో నిన్న కురిసిన అకాల వర్షానికి నెలబారి నష్టపోయిన మొక్కజొన్న, ఉల్లి పంటలను ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి గారు పరిశీలించారు. రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. వ్యవసాయశాఖ అధికారులకు ఎంత పంట నష్టపోయింది వివరాలు సేకరించి నివేదిక అందజేయాలని ఆదేశించారు.
అకాల వర్షానికి నష్టపోయిన పంట పొలాలను పరిశీలించిన ఎమ్మెల్యే
పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని రైతులకు తెలిపారు. పంట నష్టపోయిన విషయాన్ని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తో ఫోన్ లో మాట్లాడి వివరించారు. ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి గారి వెంట జడ్పీటీసీ వెంకటరామమ్మ, ఎంపీపీ సోమేశ్వరమ్మ, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.