పల్లెల ప్రగతికి ప్రాధ్యాన్యత - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

పల్లెల ప్రగతికి ప్రాధ్యాన్యత

ఏలూరు, అక్టోబర్ 16, (way2newstv.com):
కొమడవోలు పంచాయతి  అభివృద్ధికి  పూర్తిగా సహకరిస్తామని ఉపముఖ్యమంత్రి ఆళ్లనాని చెప్పారు. స్థానిక మంత్రి క్యాంపు కార్యాలయంలో  బుధవారం వైఎస్ ఆర్ సిపి ఏలూరు నగర నాయకులు  మంచెం మైబాబు ఆధ్వర్యంలో 200 మంది మహిళలు,  వెలుగు కార్యకర్తలు శ్రీరామ మందిరం భక్తులు ఆళ్లనానిని కలసి గజమాలతో  ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ  పల్లెసీమల ప్రగతికి ప్రత్యేక ప్రాధ్యాన్యత  ఇస్తామని అన్ని గ్రామలు అభివృద్ధి పనులు చేపట్టి ప్రజలకు మౌలిక వసతులు కల్పిస్తామని ఆయన చెప్పారు. 
పల్లెల ప్రగతికి ప్రాధ్యాన్యత

కొమడవోలు  గ్రామ పరిధిలో ప్రజలకు ఉ అవసరాలు ఉన్న మైబాబు దృష్టికి  తీసుకువస్తే వాటంన్నింటిని  పరిష్కరిస్తానని ఆయన చెప్పారు. శ్రీరామ మందిరం  దేవదాయ శాఖ పరిధిలోకి తీసుకువచ్చి రెండురోజులలోనే నూతన కార్యవర్గాన్ని ప్రకటిస్తామని అదేవిధంగా డ్వాక్రా మహిళలు ఆర్ధికంగా బలోపేతం కావడానికి అవసరమైన రుణాలను అందిస్తామని ఆయన హామి ఇచ్చారు. గత  ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు తీవ్ర అన్యాయం చేసిందని వడ్డీలేని రుణాలు ఇవ్వకుండా ఐదేళ్లు  కాలక్షేపం చేసి డ్వాక్రా మహిళల ఆర్ధిక పరిస్థితిని దెబ్బతీసిందని ఆయన చెప్పారు. కొమడవోలు గ్రామ పంచాయతీ అంటే తనకు తొలి నుండి ఎంతో అండగా ఉన్నారని అటువంటి గ్రామ అభివృద్ధికి తగు చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.