వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
వనపర్తి అక్టోబరు 16, (way2newstv.com)
వ్యవసాయ అనుబంధ రంగాలకు ప్రభుత్వం పెద్ద పీట వేస్తూ సాగునీటితో పాటు చెరువులలో ఉచితంగా చేపపిల్లలను వదలటం జరుగుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఆయన బుధవారం వనపర్తి లోని నల్లచెరువు లో చేప పిల్లలను వదిలి మీడియా సమావేశంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం, మత్స్యకారులకు ఉపాధి, రైతుల ముఖాలలో ఆనందం చూడాలన్నదే తమ ధ్యేయమని ఆయన అన్నారు. గత నాలుగేళ్లుగా తెలంగాణ ప్రభుత్వం మిషన్ కాకతీయ తో చెరువులను బాగు చేసి పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి కాల్వల ద్వారా వ్యవసాయ అనుబంధ రంగాలకు నీటి నిల్వలను పెంచుతుందని ఆయన అన్నారు,
వ్యవసాయ అనుబంధ రంగాలకు ప్రభుత్వం పెద్ద పీట
వనపర్తి నల్లచెరువు ను మినీ ట్యాంకుబండ్ గా రూపొందించడం జరిగిందని, మొదటిసారిగా కృష్ణా నది నీళ్లతో చెరువు అలుగు బాగుందని అన్నారు. రైతులకు నీళ్లు ఇవ్వడం తో పాటు మత్స్యకారులకు ఉచితంగా చేప పిల్లల ను ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి దేనంటూ జిల్లాలో ఇప్పటివరకు 290 చెరువులలో కోటి నలభై ఒక్క లక్షల చేపపిల్లలను విడుదల చేశామని ఆయన అన్నారు. దీంతో రైతులతో పాటు మత్స్యకారులు, ఇతర లంతా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారని ఆయన అన్నారు. ముఖ్యంగా మత్స్యకారులకు ఉచిత చేప పిల్లలు తో పాటు రవాణాకు, వేటకు వెళ్లేందుకు , చేపలు అమ్ముకునేందుకు చిన్న, పెద్ద వాహనాలను మరియు వలలు, మార్కెట్ యార్డులో చేపల కేంద్రాలను ప్రభుత్వం సమకూర్చింది అని ఆయన అన్నారు. ప్రతియేటా రాష్ట్రంలో మత్స్య సంపదను పెంచుతూ పోతుందని, దీనివల్ల మత్స్యకారులకు ఉపాధితో పాటు తెలంగాణ ప్రజలకు బలవర్థకమైన ఆహారం లభిస్తుందని ఆయన అన్నారు, వనపర్తి మత్స్యకారులు గత మూడున్నర దశాబ్దాలుగా వృత్తికి దూరమై రహదారుల మీద పండు అమ్ముకోవడం వంటి ప్రత్యామ్నాయ ఉపాధి మీద ఆధారపడి జీవిస్తున్నారని ఆయన అన్నారు. నల్లచెరువు నిర్మాణంతో వనపర్తి మత్స్యకారులకు పూర్వ వైభవం వస్తుందని, మిగిలిన చెరువులను పునర్నిర్మాణం చేసి అందుబాటులోకి తీసుకువస్తామని ఆయన అన్నారుఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ లోకనాథ్ రెడ్డి. గ్రంథాలయ సంస్థ చైర్మన్ లక్ష్మయ్య, ఎంపీపీ కిచ్చా రెడ్డి, మాజీ కౌన్సిలర్లు గట్టు యాదవ్, వాకిటి శ్రీధర్, లక్ష్మీనారాయణ, నందిమల్ల శ్యాం కుమార్, చుక్క రాజు, తిరుమల్, పాకనాటి కృష్ణ, మత్స్యకార మరియు గంగపుత్ర సంఘం నాయకులు చంద్రయ్య, ఎర్ర మన్యం, కాగితాల గిరి, నరసింహ, కంచ రవి, శ్రీనివాసులు, పుట్టపాక మహేష్, నంది మల్లసుభాష్, తదితరులు పాల్గొన్నారు.