హైదరాబాద్ అక్టోబరు 16, (way2newstv.com)
జోగులాంబ గద్వాల జిల్లా జడ్పీ చైర్ పర్సన్ సరిత తిరుపతయ్య రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని బుధవారం మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్బంగా జిల్లా సమస్యలపై మాట్లాడారు. తరువాత జడ్పీ చైర్ పర్సన్ మీడియాతో మాట్లాడుతూ జోగులాంబ గద్వాల జిల్లాలోని విద్య వ్యవస్థ అన్ని విధాలుగా కోంత వెనుక బడి ఉంది.
కొన్ని పాఠశాలలకు కాంపౌండ్ వాల్స్, అదనపు గదులు కావాలని, ఇన్చార్జి డీఈవో ఉండడంతో చాలా ఇబ్బందులకు గురవుతున్నట్లు అన్నారు. జిల్లాకు రెగ్యులర్ డీఈవో ఉండేలా చూడాలని కోరారు. విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి జిల్లాకు త్వరలోనే వస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు.