దుర్గమ్మను దర్శించుకున్న చీఫ్ జస్టిస్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

దుర్గమ్మను దర్శించుకున్న చీఫ్ జస్టిస్

విజయవాడ  అక్టోబరు 2   (way2newstv.com)
శరన్నవరాత్రుల్లో నాల్గవ రోజున హైకోర్టు చీఫ్ జస్టిస్ జస్టిస్ ప్రవీణ్ కుమార్ కుటుంబ సమేతంగా శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారంలో ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ఇంద్రకీలాద్రికి చేరుకున్న హైకోర్టు చీఫ్ జస్టిస్ సి . ప్రవీణ్ కుమార్ దంపతులకు ఆలయ కార్యనిర్వాహణాధికారి ఎం . వి . సురేష్ బాబు స్వాగతం పలికారు . ఆలయ వేదపండితులువేదమంత్రాలతో కూడి అమ్మవారి దర్శనానికి తోడ్కొని తీసుకుని వెళ్లారు .
దుర్గమ్మను దర్శించుకున్న చీఫ్ జస్టిస్

దర్శనం అనంతరం అమ్మవారిని ఆశీస్సులతో కూడిన వేదపండితులు , ఆలయ ప్రధాన అర్చకులు , ఇవో ఆధ్వర్యంలో అమ్మవారి శేషావస్త్రాన్ని , ప్రసాదాన్ని అమ్మవారి ఫోటో జ్ఞాపికను అందజేశారు .