హైదరాబాద్ అక్టోబర్ 31(way2newstv.com):
ఈఎస్ఐ స్కామ్ కేసులో ఏసీబీ దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో డైరెక్టర్ దేవికా రాణి డొల్ల కంపెనీల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. తేజ ఫార్మా కంపెనీ యజమాని రాజేశ్వర్ రెడ్డి సోదరుడు శ్రీనివాస రెడ్డి పేరుతో రెండు షెల్ కంపెనీలు ఏర్పాటు చేసినట్టు విచారణలో తేలింది.
షెల్ కంపెనీల పేరుతో రూ.కోట్లు దండుకున్న దేవికారాణి
ఈ రెండు షెల్ కంపెనీల పేరుతో డైరెక్టర్ దేవికారాణి, ఫార్మాసిస్ట్ నాగలక్ష్మి కోట్లు దండుకున్నట్టు తెలిసింది. డొల్ల కంపెనీల పేరుతో నొక్కేసిన డబ్బుతో.. దేవికారాణి రూ.3 కోట్ల విలువైన బంగారం కొన్నట్టు గుర్తించారు. అల్వాల్లోని శ్రీనివాస రెడ్డి ఇల్లు, ఆఫీస్లో ఏసీబీ సోదాలు నిర్వహించింది.