ప్రతిపక్షాలు గుణపాఠం నేర్చుకోవాలి - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ప్రతిపక్షాలు గుణపాఠం నేర్చుకోవాలి

నాగర్ కర్నూలు, అక్టోబర్ 25, (way2newstv.com):
నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ లో పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మీడియాతో మాట్లాడారు .ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ,అచ్ఛంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కుడా పాల్గోన్నారు. మంత్రి మాట్లాడుతూ రాష్టంలో ముఖ్యమంత్రి ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టి పేద ప్రజలను ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి కృషి చేస్తున్న గొప్ప వ్యక్తి అని కొనియాడారు. ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికైనా నోరు అదుపులో ఉంచుకోవాలి.  
ప్రతిపక్షాలు గుణపాఠం నేర్చుకోవాలి

ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని మంత్రి అన్నారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు.  ప్రతిపక్ష పార్టీలు హుజుర్ నగర్ లో ఉప ఎన్నికల ఫలితాలను చూసి గుణపాఠం నేర్చుకోవాలి అనిఅన్నారు.  హుజుర్ నగర్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి ఒక వార్డు సభ్యునికి వచ్చిన ఓట్లు కూడా రాలేదని అన్నారు.  ప్రతిపక్షాలు మీడియా ముందు ఇష్టం వచ్చినట్లు అరవడం  కాదు,  ప్రజల్లోకి వచ్చి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి ని చూసుకోండని అన్నారు.  గత 40 సంవత్సరాలలో జరగని అభివృద్ధి 5 సంవత్సరాలలో జరిగిందని ఆయన అన్నారు. ప్రభుత్వం పాడి రైతులకు అందించే నగదు  ప్రోత్సాహకాలను రెండు రోజుల్లో విడుదల చేస్తాం అని అన్నారు.