మహబూబ్ నగర్ అక్టోబర్ 11,(way2newstv.com):
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ లో మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పల్లి విక్రయ కేంద్రాన్ని మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ శుక్రవారం ప్రారంభించారు. సందర్భంగా ఆయన రైతులకు కు పల్లి విత్తనాలను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మహబూబ్ నగర్ వ్యవసాయ మార్కెట్ పరిధిలో 470 ఎకరాలకు సరిపడ పల్లి విత్తనాలను సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు.
పల్లి విత్తనాలకు పంపిణీ చేసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
ఇటీవలికాలంలో తృణధాన్యాల కు డిమాండ్ పెరగడంతో రైతులను తృణ ధాన్యాల సాగుకు ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు ఈ క్రమంలోనే ఏడాది వెయ్యి ఎకరాల్లో జిల్లా వ్యాప్తంగా కొఱ్ఱల సాగు చేపడుతున్నట్లు తెలిపారు. వరికి ప్రత్యామ్నయంగా మార్కెట్లో డిమాండ్ ఉండే పంటలనుసాగు చేసే విధంగా రైతుల్లో విస్తృతమైన అవగాహన తీసుకువచ్చేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ కోరమోని వెంకటయ్య, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆంజనేయులు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చెరుకుపల్లి రాజేష్ తదితరులు పాల్గొన్నారు
Tags:
telangananews