హైద్రాబాద్, నవంబర్ 1 (way2newstv.com)
పవన్ కళ్యాణ్ రాజకీయాలలో అడుగుపెట్టేటప్పటికీ… సినిమాల్లో పవన్ క్రేజ్ టాప్ 1. బాహుబలి తర్వాత ప్రభాస్, పవన్ సరసన చేరినా. పవన్ క్రేజ్ ముందు ప్రభాస్ కూడా సరిపోడు అన్నంతగా ఆయన క్రేజ్ టాప్ లెవల్లో ఉండేది. ఇక రాజకీయాల్లోకి అడుగుపెట్టిన… పవన్ మళ్ళీ సినిమాలు ఎప్పుడు చేస్తాడా అని ఆయన ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఫ్యాన్స్ మాత్రమేనా చాలామంది దర్శకనిర్మాతలు పవన్ సినిమాల్లోకి రీ ఎంట్రీ కోసం వెయిటింగ్ లో ఉన్నారు.
నవంబర్ 15 నుంచి పవన్ సినిమా ?
అయితే పవన్ రీ ఎంట్రీ ఫిలిం క్రిష్ కి దక్కినట్లుగా. … ఆ సినిమా నవంబర్ 15 న మొదలవ్వబోతున్నట్లుగా వార్తలొస్తున్నాయి.అయితే పవన్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తాడో లేదో…అని ఇప్పటివరకు ప్రచారం జరిగితే.. ఇప్పుడు పవన్ రీఎంట్రీ రెమ్యునరేషన్ ఎంతో అంటూ హాట్ హాట్ గా ఇండస్ట్రీ మొత్తం ఆసక్తిగా మాట్లాడుకుంటున్నారు. మాములుగా పవన్ కళ్యాణ్ క్రేజ్ ని బట్టి నిర్మాతలే ఆయనికి అదిరిపోయే పారితోషకం ఇస్తారు.. అయితే ఎక్కడా పవన్ డిమాండ్ చేసినట్లుగా న్యూస్ లేదు. స్తుతం పవన్ రీ ఎంట్రీ ఇస్తున్న సినిమా మీద భారీహిప్ ఉండడంతో… పవన్ రెమ్యునేషన్ గతంలో కన్నా డబుల్ ఉండొచ్చనే ఊఅహగానాలు మొదలయ్యాయి. పవన్ రెమ్యునరేషన్ సినిమా లో సగం బడ్జెట్ తో పోల్చొచ్చని అంటున్నారు