గ్రేటర్ లో 200 ప్రాంతాల్లో క్రిస్మ‌స్ ఉత్స‌వాలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

గ్రేటర్ లో 200 ప్రాంతాల్లో క్రిస్మ‌స్ ఉత్స‌వాలు

డిసెంబర్ 5నుండి 10తేదీల్లో క్రిస్మస్ గిఫ్ట్ ల పంపిణీ,  19న క్రిస్మస్ ఫీస్ట్
హైదరాబాద్ నవంబర్ 28, (way2newstv.com):
నగరం లో క్రిస్మస్ వేడుకల నిర్వహణపై  నగర మెయర్ బొంతు రామమోహన్  అధ్యక్షతన నేడు ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ప్రభుత్వ సలహాదారు ఏ.కే. ఖాన్, స్పెషల్ సీ.ఎస్.అజయ్ మిశ్రా,ఎమ్మెల్యే ఎం. గోపీనాథ్, డెప్యూటి మెయర్ బాబా ఫసియొద్దిన్, జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ డి.ఎస్‌.లోకేష్ కుమార్‌, మైనార్టీ శాఖ డైరెక్ట‌ర్ షాన‌వాజ్ హుస్సేన్, అదనపు కమీషనర్లు దాసరి  హరి చందన, సిక్థా పట్నాయక్, కార్పొరేటర్లు, జీహెచ్ఎంసీ అధికారులు హాజరయ్యారు. ఈ సందర్బంగా మేయర్ బొంతు రామమోహన్, సలహాదారు ఎ.కే. ఖాన్ లు  ఈ క్రింది అంశాలను వెల్లడించారు.
గ్రేటర్ లో 200 ప్రాంతాల్లో క్రిస్మ‌స్ ఉత్స‌వాలు  

* క్రిస్మ‌స్ పండుగ‌ను పుర‌స్క‌రించుకొని జీహెచ్ఎంసీ ప‌రిధిలో 200 ప్రాంతాల్లో పేద క్రిస్టియ‌న్‌ల‌కు గిఫ్ట్ ప్యాకెట్లు, క్రిస్మ‌స్ విందును నిర్వ‌హించ‌నున్నాం.    
*సీ.ఎం  విందు డిసెంబర్ 20లెదా 21న వుండే అవకాశం.  
* ప్ర‌తి డివిజ‌న్‌లో ఒక చ‌ర్చి ప్రాంతాన్ని సంబంధిత కార్పొరేట‌ర్ డిసెంబర్ 3వతేదీ లోపు గుర్తించాలి.
* ప్ర‌తి అసెంబ్లీ నియోజ‌క ప‌రిధిలో క‌నీసం రెండు ప్రాంతాల‌ను సంబంధిత ఎమ్మెల్యేలు ఎంపిక చేయాలి.
* ప్ర‌తి లొకేష‌న్‌లో 500 గిఫ్ట్ ప్యాక్‌ల‌ను పంపిణీ చేస్తారు.
* డిసెంబ‌ర్ 5వ  తేదీనుండి 10 వ తేదీల మ‌ధ్య‌ కొత్త బ‌ట్ట‌లతొ కూడిన గిఫ్ట్ ల పంపిణీ.    *ప్రతి చర్చి కి లక్ష రూపాయల కేటాయింపు. చర్చి నిర్వాహకుల బ్యాంక్ అక్కౌంట్లకు ఈ లక్ష రూపాయలు జమ చేస్తారు.
* డిసెంబ‌ర్ 19వ తేదీ లోపు  క్రిస్మ‌స్ ఫీస్ట్ ప్రత్యేకంగా నిర్వ‌హించాలి.
* క్రిస్మ‌స్ గిఫ్ట్ ప్యాక్‌, ఫీస్ట్ నిర్వ‌హ‌ణ‌కు వేదిక‌ను ఎంపిక చేయ‌డానికి డిప్యూటి క‌మిష‌న‌ర్లు సంబంధిత కార్పొరేట‌ర్లు, ఎమ్మెల్యేలు, చ‌ర్చీ ప్ర‌తినిధుల‌తో ప్ర‌త్యేక స‌మావేశం నిర్వ‌హిస్తారు.    *గతంలో నిర్వహించిన చర్చీలు కాకుండా ఇతర చర్చీలను ఎంపిక చేసేలా చర్యలు.
* జీహెచ్ఎంసీ ప‌రిధిలో 200 ప్రాంతాల్లో 500 చొప్పున మొత్తం ల‌క్ష మందికి గిఫ్ట్ ప్యాకెట్లు పంపిణీ చేస్తారు.
* ప్ర‌తి గిఫ్ట్ ప్యాకెట్‌లో ఒక పాలిస్ట‌ర్ ప్యాంట్‌, ఒక‌ ష‌ర్ట్‌, ఒక చీర, జాకెట్ పీస్‌, సెల్వార్ క‌మీజ్ ఉంటాయి.
*  క్రిస్మ‌స్ ఫీస్ట్ విందులో  ఒకొక్క వేదిక ద్వారా 500మందికి బిర్యాని, రైతా, స్వీట్‌కేక్‌ల‌ను అందిస్తారు.
* క్రిస్మ‌స్ గిఫ్ట్‌ల‌ను నిరుపేద‌లు, దివ్యాంగులు, వితంతువులు, అనాథ‌లు, హెచ్.ఐ.వి పేషంట్లకు ప్రాధాన్య‌త ఇస్తారు.
* డిసెంబ‌ర్ 10 వతేదీ సాయంత్రం నాంప‌ల్లి హాజ్ భ‌వ‌న్ నుండి క్రిస్మ‌స్ గిఫ్ట్ ప్యాక్‌లు పంపిణీ జ‌రుగుతుంది.
* క్రిస్మ‌స్ సంద‌ర్భంగా చ‌ర్చీల‌ను విద్యుత్ దీపాల‌తో అలంక‌రింపు.