వైసీపీ ఎంపీలు..ఎందుకిలా - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

వైసీపీ ఎంపీలు..ఎందుకిలా

న్యూఢిల్లీ, నవంబర్ 29, (way2newstv.com)
నిజానికి ఎంపీ పదవి అంటే ఒకప్పుడు గౌరవం ఉండేది. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు పెద్దగా ఉంటూ అత్యున్నత వేదిక అయిన పార్లమెంట్ లో సమస్యలపైన గళం వినిపించేవారు. సబ్జెక్ట్ బాగా వచ్చిన వారు. ప్రజా నాయకులు నాడు ఎంపీలుగా ఉండేవారు. ఇపుడు ఎంత ఎక్కువగా డబ్బు ఖర్చు పెడితే వారు లోక్ సభ సభ్యులుగా ఉంటున్నారు. ఇక పైరవీలు బాగా చేస్తే పెద్దల సభకు ఎంపిక చేస్తున్నారు దాంతో వారు తన బాధ్యతల కంటే అధికారం గురించి ఆలోచిస్తున్నారు. వాస్తవానికి పల్లెల్లో వార్డు నుంచి కూడా ప్రజా ప్రతినిధి ఉంటాడు కాబట్టి ఎంపీ ఎక్కడా వేలు పెట్టడానికి ఉండదు, వారు లోకల్ రాజకీయాల్లో జోక్యం చేసుకోవాలనుకుంటే అది ఆధిపత్య పోరుకు దారిస్తుంది. ఒక్కో ఎంపీ ఒక్కో జిల్లా ప్రతినిధిగా వ్యవహరించి కేంద్రం నుంచి నిధులు తేవడం, కేంద్ర ప్రాజెక్టులు తమ రాష్ట్రానికి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తే ఉత్తమ పార్లమెంటేరియన్ గా ఉంటారు. 
వైసీపీ ఎంపీలు..ఎందుకిలా

అయితే మారిన పరిస్థితులో పార్లమెంట్ లో గళం విప్పే వారు తక్కువ లోకల్ పాలిటిక్స్ చేసే వారు ఎక్కువ అయ్యారు.ఇక ప్రతిపక్ష ఎంపీలు అయితే ఇపుడున్న పరిస్థితుల్లో పార్లమెంట్ లో పెద్దగా విలువ ఉండడంలేదు. సంకీర్ణ రాజకీయాలు కనుక సాగితే ఎంపీలకు ఒక విలువ ఉండేది. వారి ఓటు ప్రతీసారీ అమూల్యమయ్యేది. అయితే వైసీపీ ఏపీలో అధికార పక్షం, ఢిల్లీలో ప్రతిపక్షంగా ఉంది. దాంతో ఎంపీలు అక్కడ పోరాడాల్సివుంది. మొత్తం ఏపీలో 22 మంది ఎంపీలు గెలిచినా వారు ఏం చేయాలో పాలుపోక ఇపుడు సతమతమవుతున్నారు. ఢిల్లీలో పార్టీతో దోస్తీనో, కుస్తీనో తెలియదు. అధినాయకత్వం గైడ్ లైన్స్ బట్టి అనుసరిస్తూపోవాలి. దాంతో ఏ మాట అంటే ఏమవుతుందోనని ఎంపీలు దాదాపుగా మౌనంగానే ఉంటున్నారు. ఇపుడు కొత్త రకం ఆంక్షలు కూడా అధినేత జగన్ పెట్టారని చెబుతున్నారు. దాంతో ఏదైనా సమస్య మీద కేంద్ర మంత్రులను నేరుగా కలవడం కూడా కష్టమైపోతోందిట‌. దాంతో ఎంపీలలో అసంతృప్తి మెల్లగా రాజుకుంటోందని అంటున్నారు.ఇక ఢిల్లీలో సమావేశాలు ఉంటే వెళ్తున్నారు. అక్కడ అటెండెన్స్ ఇచ్చి వస్తున్నారు. మిగిలిన కాలమంతా ఏపీలో ఉంటున్నారు. దాంతో ఇక్కడ స్థానిక రాజకీయాల్లో ఎంపీలు తమదైన జోరు చూపిస్తున్నారు. అది ఎమ్మెల్యేల‌కు ఇబ్బందిగా ఉంటోందిట. జగన్ సైతం ఎంపీలు ఎక్కువగా గెలిచారు, మన నంబర్ పెరిగింది అని మాత్రమే ఆలోచన చేస్తూ లైట్ తీసుకుంటున్నారని ప్రచారం ఉంది. కానీ వారి బాధ్యతలు ఏంటో చెప్పడంలేదు, పైగా వారు ఎన్నికైన ప్రాంతంలో కొన్ని పనులు కనీసం రాష్ట్ర ప్రభుత్వం తరఫున అయినా చేయించుకునేందుకు అధికారం, అవకాశం ఇవ్వడంలేదన్న బాధ ఎంపీలో ఉంది. అదే వారిలో మెల్లగా బాధగా మారుతోంది.ఇక తమ పార్టీ ఎమ్మెల్యేలతోనే ఎంపీలకు పేచీలు వచ్చేలా ఉంది. పేరుకు ఎంపీ, ఒక ఇల్లు కూడా మంజూరు చేయించలేరు, ఒక రేషన్ కార్డుకు కూడా ఇప్పించలేడు. ఇదీ ఎంపీల అసలు బాధ. ఎటూ కేంద్రంలో ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ ఎంపీలకు ఏపీలో కూడా పనులు చేసుకునేందుకు అవకాశం ఇస్తే బాగుంటుందన్న మాట వినిపిస్తోంది. ఇదే బాధను ఎంపీలు విజయసాయిరెడ్డితో చెప్పుకుని తమ సంగతి చూడమన్నారుట. మరి విజయసాయిరెడ్డి జగన్ దృష్టికి తీసుకువెళ్ళి వారికీ లోకల్ గా ఒక గుర్తింపు, గౌరవం ఇస్తే హ్యాపీగా ఉంటారు. లేకపోతే మెల్లగా మొదలైన అసంతృప్తి ఎక్కడ వరకూ పాకుతుందో ఎవరూ చెప్పలేరు అంటున్నారు