రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

మంచిర్యాల శాసనసభ్యులు నడిపల్లి దివాకర్ రావు
మంచిర్యాల నవంబర్ 18  (way2newstv.com)
రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి. సోమవారం రోజున లక్షట్ పేట మండలంలోని కొత్తూరు లో గల జిన్నింగ్ మిల్లులో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అదే విధముగా వెంకట్రావు పేట,  రంగపేట,  జెండా వెంకటాపూర్,  లక్ష్మీపూర్ లలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. 
రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

ఈ సందర్భంగా శాసనసభ్యులు దివాకర్ రావు మాట్లాడుతూ రైతులు దళారుల మోసపోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో తాము పండించిన పంటను విక్రయించి ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర పొందాలని తెలిపారు. ఆయన వెంట స్థానిక ప్రజా ప్రతినిధులు,  మార్కెటింగ్ శాఖ అధికారులు, రైతులు ఉన్నారు.