నందికొట్కూరు నవంబర్ 19 (way2newstv.com)
నందికొట్కూరు మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కొణిదెల ను కర్నూలు డివిజన్ ఉప విద్యా శాఖ అధికారిణి అనురాధ ఆకస్మిక తనిఖీ చేశారు. ఉదయం ప్రార్థనా సమయానికి పాఠశాల చేరుకుని ప్రార్థన సమావేశంలో ముఖా ముఖి లో పాల్గొన్నారు. పదవ తరగతి విద్యార్థులు పదికి పది గ్రేడ్ పాయింట్లు సాధించాలని చెప్పారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు.ప్రార్థన సమావేశానికి పాఠశాలకు విద్యార్థులు,ఉపాధ్యాయులు అందరూ హాజరవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
కొణిదెల పాఠశాల ఆకస్మిక తనిఖీ చేసిన ఉప విద్యాశాఖ అధికారిణి
అనంతరం పాఠశాల రికార్డులను తనిఖీ చేశారు. బయోమెట్రిక్ పనితీరు గురించి, మధ్యాహ్న భోజన పథకం గురించి, డిసీఆర్, విసీఆర్ నిర్వహణ గురించి వాకబు చేశారు. ఆనంద వేదిక తరగతులను గురించి ఆరా తీశారు. రాష్ట్ర స్థాయి క్రీడాకారులను,ఫిజికల్ డైరెక్టర్ ను అభినందించారు. పాఠశాల తరగతి గదులను పరిశీలించి విద్యార్థుల ను ప్రశ్నించారు. క్రీడా మైదానం ను పాఠశాలలో క్లీన్ అండ్ గ్రీన్ ను పర్యవేక్షించి సంతృప్తి వ్యక్తం చేశారు, అర్హులైన అందరికీ అమ్మఒడి పథకం వర్తించేలా ప్రధాన ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చివరగా పాఠశాల ఆవరణ లో మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు సత్యం, స్టాఫ్ సెక్రెటరీ ఖాజా హుస్సేన్, ఫిజికల్ డైరెక్టర్ శ్రీనాథ్ ఉపాధ్యాయులు నారాయణ రెడ్డి,ప్రసాద్, నీరజ, ఉమా మహేశ్వరి,యాస్మీన్ తదితరులు పాల్గొన్నారు
Tags:
News