విజయవాడ, నవంబర్ 13, (way2newstv.com)
ఆంధ్రప్రదేశ్ కొత్త చీఫ్ సెక్రటరీగా 1984 బ్యాచ్‌కి చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారిణి నీలం సహానీ నియమితులు కాబోతున్నారు. ప్రస్తుతం కేంద్ర సర్వీసులో ఉన్న నీలం సహానీని ఏపీ ప్రభుత్వ వినతి మేరకు రాష్ట్రానికి తిప్పి పంపేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ఆమెను మళ్లీ ఏపీ కేడర్‌కి పంపేందుకు కేంద్ర కేబినెట్ నియామకాల కమిటీ సోమవారం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఏపీ కొత్త సీఎస్‌గా నీలం సహానీ నియామకం ఇక లాంఛనమే. బహుశా నీలం సహానీ నియామక ఉత్తర్వులు నేడు వెలువడవచ్చురాష్ట్ర విభజన తర్వాత… ఆంధ్రప్రదేశ్ మొదటి మహిళా సీఎస్‌గా నీలం సహానీ చరిత్ర సృష్టించనున్నారు. ఆమెకు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కి సతీ నాయర్, మిన్నీ మాథ్యూ చీఫ్ సెక్రటరీలుగా పనిచేశారు.
ఒకటి, రెండు రోజుల్లో కొత్త సీఎస్
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి సీఎస్‌గా సతీ నాయర్ చరిత్రలో నిలిస్తే, విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి సీఎస్‌గా నీలం సహానీ రికార్డులకు ఎక్కనున్నారు. ప్రస్తుతం నీలం సహానీ కేంద్ర సామాజిక న్యాయ శాఖ కార్యదర్శిగా పని చేస్తున్నారు. ఆమె భర్త అజయ్ సహానీ కూడా సీనియర్ ఐఏఎస్ అధికారే. ఆయన ప్రస్తుతం కేంద్రంలో ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నీలం సహానీ రాష్ట్రానికి తిరిగి వస్తున్న నేపథ్యంలో ఆయన కూడా త్వరలో ఏదైనా కీలక పదవిలోకి ఇక్కడికే రావొచ్చునన్న ప్రచారం జరుగుతోంది.సీఎస్‌గా నీలం సహానీ ఎంపిక ఏదో సీఎం జగన్ అప్పటికప్పడు తీసుకున్న నిర్ణయం కాదని తాజా పరిణామాల్నిబట్టి అర్ధమవుతోంది. సీఎస్‌గా ఉన్న ఎల్వీ సుబ్రమణ్యాన్ని బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన రోజే…. నీలం సహానీ సీఎం జగన్‌ను కలిశారు. ఆయనతో పాటే భోజనమూ చేశారు. కొత్త సీఎస్‌గా నీలం సహానీ రాబోతున్నారని ఆ రోజే అందరికీ అర్ధమైపోయింది. నీలం సహానీ కంటే సీనియర్లలో 1983 బ్యాచ్‌కి చెందిన ప్రీతి సుడాన్ ఉన్నా, సీఎస్‌గా ఆమెను కాదని నీలంనే జగన్ ఎంపిక చేసుకున్నారు. నీలం సహానీతో పాటు సమీర్‌శర్మ, రెడ్డి సుబ్రమణ్యం తదితరుల పేర్లు సీఎస్ రేసులో వినిపించినా చివరకు…. నీలం సహానీనే అత్యున్నత పదవి వరించింది