ఆలయాలకు కార్తీక శోభ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఆలయాలకు కార్తీక శోభ

హైద్రాబాద్, విజయవాడ, నవంబర్ 12 (way2newstv.com)
కార్తీక మాసంలో శుక్లపక్షము నందు పున్నమి తిథి కలిగిన 15వ రోజు కార్తీక పౌర్ణమి లేదా కార్తీక పున్నమి. ఈ కార్తీక పౌర్ణమి శివ, కేశవులకు అత్యంత ప్రీతికరమైన మాసం. కార్తీక పౌర్ణమి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా భక్తులు ఆలయాలకు బారులు తీరారు. భద్రాచలం గోదావరి నది వద్ద భక్తుల రద్దీ పెరిగింది. తెల్లవారుజామున 3 గంటల నుంచే భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి గోదావరి నదిలో కార్తిక దీపాలు వదులుతున్నారు. అదేవిధంగా జోగులాంబ, బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే తుంగభద్ర నది తీరంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. హన్మకొండలోని వేయిస్తంభాల ఆలయంలో స్వామివారి దర్శనానికి భక్తులు బారులు తీరారు.
ఆలయాలకు కార్తీక శోభ

నల్గొండ జిల్లా చిట్యాల మండలం చెర్వుగట్టులోని ప్రముఖ శైవ క్షేత్రం పార్వతి సమేత జడల రామలింగేశ్వరస్వామి దేవస్థానంకు కార్తీక పౌర్ణమి సందర్భంగా తెల్లవారుజామునుంచే భక్తులు పోటెత్తారు. స్వామి వారి కొనేరులో పుణ్యస్నానాలు చేసి, వివిధ రకాల ప్రమిధల్లో కార్తీక దీపాలు వెలిగించారు భక్తులు. స్వామి వారి దర్శనానికి బారులు తీరారు. స్వామి వారి దర్శనానికి గంటల సమయం పట్టింది. భక్తులు స్వామి వారికి సామూహిక అభిషేకాలు,సత్యనారాయణ స్వామి వ్రతాల మండపాలు భక్తులతో కిక్కిరిసి పోయాయి. కార్తీక పౌర్ణమి కావడంతో దేవాలయాన్ని విద్యుత్ లైట్లు, పూలతో అందగా అలంకరించి, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండ మంచినీటి సౌకర్యం, అదనపు ప్రసాద కౌంటర్లను ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు దేవస్థాన అధికారులు. స్వామి వారికి తెల్లవారుజామున మహాన్యాసపూర్వ రుద్రాభిషేకం నిర్వహించారు అర్చకులు. మధ్యాహ్నం జరిగే మాసకల్యాణం, సాయంకాలం జ్వలతోరణం, రాత్రి కార్తీక పురాణ ప్రవచనాలకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఖమ్మం జిల్లా దక్షిణ కాశీగా పెరుపొందింన మధిర శ్రీ మృత్యంజయస్వామి వారి దేవాలయంలో కార్తీకమాసం సందర్భంగా తెల్లవారుజాము నుండే వేలాదిమంది భక్తులు  హర హర మహాదేవ శంభో శంకర  అంటూ శివనామ స్మరణతో ఆలయం మారుమ్రోగుతుంది, అత్యంత భక్తి శ్రద్ధలతో కార్తీక దీపాలను వెలిగించారు, ఆలయంలో ప్రత్యెక పూజలు నిర్వహించారు అనంతరం తీర్థ ప్రసాదాలను భక్తులకు అందజేశారు,భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు..ఈ కార్యక్రమంలో వేలాది మంది మహిళాలు ఆలయ అర్చకులు ,అధికారులు పాల్గొన్నారు...అటు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగాకార్తీక పౌర్ణమి పురస్కరించుకుని శివలయాలన్ని  శివనామ స్మరణలతో మారు మ్రోగుతున్నాయి .వేకువజామునుండే  ఆలయాల్లో    భక్తులు పోటెత్తారు దీపాలు వెలిగించి  మొక్కులు తీర్చుకుంటున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వరం ముక్తీశ్వర స్వామి ఆలయంలో భక్తుల పెద్దసంఖ్యలో వచ్చారు .కార్తీక పౌర్ణమి సందర్భంగా పవిత్ర గోదావరి నదిలో స్నానాలు చేసి కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారి దర్శనం చేసుకున్నారు ప్రత్యేక పూజలు నిర్వహించారు