అమృత్‌ మెడికల్ షాపులు రెడీ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

అమృత్‌ మెడికల్ షాపులు రెడీ

హైద్రాబాద్, నవంబర్ 21, (way2newstv.com)
టీచింగ్ హాస్పిటల్స్‌‌‌‌ నుంచి ఏరియా ఆస్పత్రుల వరకూ దాదాపు 70 సర్కారు దవాఖాన్లలో ‘అమృత్‌‌‌‌’ పేరిట మెడికల్ షాపులు ప్రారంభం కానున్నాయి. జనరిక్‌‌‌‌ మెడిసిన్‌‌‌‌తోపాటు బ్రాండెడ్ మందులు, సర్జికల్స్‌‌‌‌, ఇంప్లాంట్స్ సహా అన్ని ఐటమ్స్‌‌‌‌ ఈ షాపుల్లో అందుబాటులో ఉండనున్నాయి. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వ సంస్థ హిందుస్థాన్ లేటెక్స్ లిమిటెడ్‌‌‌‌(హెచ్‌‌‌‌ఎల్‌‌‌‌ఎల్‌‌‌‌)తో రాష్ర్ట ప్రభుత్వం ఇది వరకే ఒప్పందం చేసుకుంది. ‘దీన్‌‌‌‌ దయాల్‌‌‌‌ అమృత్‌‌‌ పేరిట కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ర్టాల్లో మెడికల్ షాపులు పెట్టిస్తోంది. దవాఖాన్లలో రాష్ర్ట ప్రభుత్వం స్థలం కేటాయిస్తే, ఈ సంస్థ షాపులు పెట్టి డిస్కౌంట్‌‌‌‌పై మెడిసిన్ అమ్ముతుంది. 
అమృత్‌ మెడికల్ షాపులు రెడీ

హెచ్ఎల్‌‌‌‌ఎల్‌‌‌‌ సంస్థ సొంతంగా కొన్ని మెడిసిన్స్ తయారు చేస్తుండగా, మిగతా వాటిని కంపెనీల నుంచి బల్క్‌‌‌‌లో కొనుగోలు చేస్తుంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ కావడంతో తక్కువ లాభం చూసుకుని, ప్రజలకు అందుబాటులో ధరలో మందులు అందిస్తామని సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. బయటి షాపుల్లో కంటే 30 నుంచి 40% తక్కువకు అమృత్ షాపుల్లో మెడిసిన్ లభిస్తుందని మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌ డాక్టర్ రమేశ్‌‌‌‌రెడ్డి తెలిపారు.జన్ ఔషధి పేరిట తొలుత జనరిక్ మెడిసిన్ మాత్రమే ఈ షాపుల్లో అమ్మాలని నిర్ణయించారు. నిమ్స్‌‌‌‌లో ఓ షాపు కూడా ప్రారంభించారు. అయితే, జనరిక్ మెడిసిన్‌‌‌‌కు ఆదరణ లేకపోవడం, షాపుల నిర్వహణ వర్కవుట్ కాకపోవడంతో బ్రాండెడ్ మెడిసిన్ కూడా అమ్మాలని నిర్ణయించినట్టు సంస్థ ప్రతినిధి బలాల తెలిపారు. రాష్ర్టంలోని కొన్ని దవాఖాన్లలో ఇప్పటికే స్థల కేటాయింపు పూర్తవగా, డిసెంబర్‌‌‌‌‌‌‌‌లో రాష్ర్టంలోని 15 దవాఖాన్లలో షాపులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు వెల్లడించారు. అన్ని టీచింగ్‌‌‌‌ హాస్పిటళ్లు, జిల్లా హాస్పిటళ్లు, ఏరియా హాస్పిటళ్లలో ఈ షాపులు ఏర్పాటు చేయనున్నారు.ఇప్పటికే కొన్ని సర్కారు దవాఖాన్లలో ప్రైవేటు మెడికల్ షాపులు దందా సాగిస్తున్నాయి. హైదరాబాద్‌‌లోని గాంధీ హాస్పిటల్‌‌‌‌లో అయితే ఏకంగా మూడు షాపులు ఉన్నాయి. ఈ షాపుల్లో రోజూ రూ.లక్షల్లో వ్యాపారం జరుగుతోందని హాస్పిటల్‌‌‌‌ ఆఫీసర్లే చెబుతున్నారు. ప్రభుత్వం అవసరమైన మెడిసిన్ పంపిణీ చేయకపోవడం, కొంత మంది డాక్టర్లు షాపుల వాళ్లతో లాలూచి పడడంతో మెడికల్ షాపుల దందా మూడు పువ్వులు.. ఆరు కాయలు అన్నట్లుగా సాగుతోంది. దవాఖాన్లలో జనరిక్ మెడిసిన్ షాపులకు మాత్రమే అనుమతినివ్వాలని పదేండ్ల కిందటనే ప్రభుత్వం ఉత్తర్వులు (జీవో 54) జారీ చేసినప్పటికీ, అది ఎక్కడా అమలు కావడం లేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రభుత్వమే అన్ని హాస్పిటళ్లలో మెడికల్ షాపులు పెట్టి బ్రాండెడ్‌‌‌‌ మెడిసిన్ అమ్మకాలకు తెర తీస్తుండడంతో, ఫ్రీ మెడిసిన్ పంపిణీ ఎత్తేస్తారేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.