ప్రాణం మీదకు మధ్యాహ్న భోజన పథకం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ప్రాణం మీదకు మధ్యాహ్న భోజన పథకం

నల్గొండ, నవంబర్ 21, (way2newstv.com)
సర్కారీ స్కూళ్లలో మధ్యాహ్నా భోజన పథకం హెడ్మాస్టర్ల మీదికొచ్చి పడింది. గోదాములకు వెళ్లి బియ్యం తీసుకునేందుకు హెచ్‌‌ఎంలు తిప్పలు పడుతున్నారు. గతంలో బియ్యం నేరుగా స్కూళ్లకు వచ్చేవి. కానీ ఇప్పుడు గోదాముల దగ్గరకు వెళ్లి హెడ్మాస్టర్లు, టీచర్లు తెచ్చుకోవాల్సిన పరిస్థితి. కొన్నిచోట్ల ట్రాన్స్‌‌పోర్టు, హమాలీ చార్జీలు హెచ్‌‌ఎంలే చెల్లిస్తున్నారు. మరికొన్ని చోట్ల 50 కిలోమీటర్ల దూరం వెళ్లి బియ్యం తెచ్చుకుంటున్నామని హెచ్ఎంలు వాపోతున్నారు.రాష్ట్రంలో మొత్తం 28,621 సర్కారీ, ఎయిడెడ్‌‌తో పాటు వివిధ స్కూళ్లలో మిడ్డే మీల్స్‌‌ స్కీమ్‌‌ అమలవుతోంది. దీని ద్వారా 23,87,751 మంది స్టూడెంట్స్ లబ్ధి పొందుతున్నారు. ఒకటో తరగతి నుంచి 8వ తరగతి వరకూ19,13,868 మంది చదువుతున్నారు. వీరికి అయ్యే ఖర్చులో 60 శాతం కేంద్రం, మిలిగిన 40 శాతం స్టేట్‌‌ గవర్నమెంట్‌‌ భరిస్తున్నాయి.
ప్రాణం మీదకు మధ్యాహ్న భోజన పథకం

 9,10వ తరగతులకు అయ్యే ఖర్చంతా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. ప్రైమరీ విద్యార్థికి రోజుకు వందగ్రాములు, హైస్కూల్‌‌ విద్యార్థికి 150 గ్రాముల బియ్యం ఇస్తున్నారు. ఇంత తక్కువ క్వాంటిటీతో స్టూడెంట్లకు కడుపు నిండా భోజనం అందివ్వడం కష్టమని హెడ్మాస్టర్లు చెప్తున్నారు. అయితే గతంలో బియ్యాన్ని స్టూడెంట్ల సంఖ్యకు అనుగుణంగా ఆయా గ్రామాల్లోని రేషన్‌‌ షాప్‌‌ ద్వారా నేరుగా స్కూళ్లకు సరఫరా చేసేవారు. ప్రస్తుతం మండల్ లెవెల్‌‌ స్టాక్‌‌ (ఎంఎల్‌‌ఎస్‌‌) పాయింట్‌‌ దగ్గర బయోమెట్రిక్‌‌ ద్వారా వేలిముద్ర వేసి, బియ్యం తీసుకోవాలి. ఎంఎల్‌‌ఎస్‌‌ పాయింట్ల వద్ద హెడ్మాస్టర్‌‌ లేదా ఆయన సూచించిన మరో టీచర్‌‌ బయోమెట్రిక్‌‌ అటెండెన్స్ వేయాలి. ఆ తర్వాత బియ్యాన్ని నేరుగా స్కూళ్లకు పంపించాలి. కానీ చాలా జిల్లాల్లో ఈ విధానం అమలు కావడం లేదు.సివిల్‌‌ సప్లై అధికారులు నేరుగా సర్కారీ స్కూళ్లకు బియ్యాన్ని అందివ్వడం లేదు. దీంతో హెడ్మాసర్లే ఎంఎల్‌‌ఎస్‌‌ పాయింట్లకు వెళ్లి, ప్రైవేటు వాహనాల్లో బియ్యాన్ని తెప్పించుకుంటున్నారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా నెలకు ఒక్కో స్కూల్‌‌కు రెండు క్వింటాళ్ల నుంచి 20 క్వింటాళ్ల వరకూ బియ్యం అవసరం. వీటిని బడులకు తెచ్చుకోవడం హెడ్మాస్టర్లకు కష్టంగామారిపోయింది. వాహనాల్లో తెచ్చుకునేందుకు ఖర్చుచేయడంతోపాటు హమాలీ కూలీలూ వారే భరించాల్సి వస్తోంది. దీనికి తోడు ఓ రోజంతా పాఠాలు చెప్పడం మానేసి, ఎంఎల్‌‌ఎస్‌‌ పాయింట్ల వద్దే గడపాల్సి వస్తోంది. కొన్ని పాయింట్ల వద్ద గంటల తరబడి క్యూలైన్లు కట్టి, బియ్యం పొందిన ఘటనలూ చాలా జరిగాయి. ఒక్కోరోజు బయోమెట్రిక్‌‌ మిషిన్లు సరిగా పనిచేయకపోతే, లైన్‌‌ ఎక్కువగా ఉన్నా, రెండోరోజూ వెళ్లాల్సి వస్తుందని హెడ్మాస్టర్లు వాపోతున్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోయినా ఉపయోగం లేకుండా పోయిందని చెబుతున్నారు.నిబంధనల ప్రకారం మిడ్డే మీల్స్‌‌ బియ్యాన్ని స్కూల్‌‌ పాయింట్ల వరకూ సరఫరా చెయ్యాలి. చాలా చోట్ల ఇలా సరఫరా చేయడం లేదు. మరోవైపు క్వింటాల్‌‌కు రెండు, మూడు కిలోల బియ్యం తక్కువ వస్తున్నాయి. స్కూల్‌‌ పాయింట్ల వద్ద బియ్యం డెలివరీ చేసే సమయంలో బయోమెట్రిక్‌‌ వేలిముద్రలు తీసుకోవాలని హెడ్మాస్టర్ల సంఘం కోరుతోంది.