ఏపీ సీఎంవోలో సూపర్ బాస్... - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఏపీ సీఎంవోలో సూపర్ బాస్...

విజయవాడ, నవంబర్ 6 (way2newstv.com)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కున్న ధైర్యం ఏంటి? ప్రతిపక్షాలను పట్టించుకోరు. విమర్శలకు సమాధానం చెప్పరు. మరోవైపు కఠిన నిర్ణయాలతో అధికారుల్లో అలజడి. జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టి ఐదు నెలలు కావస్తుంది.  జగన్ స్వయంగా తనకు తాను చిక్కులు కొనితెచ్చుకుంటున్నట్లుంది. సహజంగా  తనకు అనుకూలమైన అధికారులను జగన్ నియమించుకోవడాన్ని ఎవరూ తప్పు పట్టరు. అయితే జగన్ కూడా గత ముఖ్యమంత్రి మాదిరిగానే అధికారులు, వారిచ్చే సలహాలు, ఫీడ్ బ్యాక్ పైనే ఎక్కువ ఆధారపడు ున్నారనడంలో ఎటువంటి సందేహం లేదు.తాజాగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బదిలీ కూడా ఇలా జరిగిందనే అనుకోవాలి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సూపర్ బాస్. ఆయన అధికారులపై అజమాయిషీ చేస్తారు. 
ఏపీ సీఎంవోలో సూపర్ బాస్...

ఐఏఎస్ ల బదిలీలను కూడా ఆయన పర్యవేక్షణలోనే జరగాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ సీఎంవోయే సూపర్ బాస్ గా వ్యవహరిస్తుంది. ముఖ్యంగా సీఎంవో ప్రిన్సిపల్ సెక్రటరీగా ప్రవీణ్ ప్రకాష్ నియామకం జరిగినప్పటి నుంచి మరిన్ని వివాదాలు చోటు చేసుకున్నాయి. ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని బదిలీ చేయడాన్ని ఎవరూ తప్పుపట్టరు. ఎందుకంటే అది ముఖ్యమంత్రి ఇష్టమే. కానీ సీఎంవో అధికారులపై ఆధారపడి నిర్ణయం తీసుకుంటే మాత్రం భవిష్యత్తులో చంద్రబాబుకు జగన్ ఏ మాత్రం తీసిపోరన్న చెడ్డపేరు మాత్రం తప్పకుండా వస్తుందన్నది వాస్తవం. సలహాదారులు ఉన్నప్పటకీ వారు చప్పట్లకే పరిమితమయ్యారు. ఇప్పటికైనా సీఎంవో సూపర్ బాస్ గా వ్యహరించకుండా అనుభవం ఉన్న ఉన్నతాధికారుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలంటున్నారు కొందరు ఐఏఎస్ అధికారులుముఖ్యమంత్రి కార్యాలయం అంటే జగన్ కు అన్ని విధాలుగా చేదోడు వాదోడుగా ఉండాలి. ఒక నిర్ణయం తీసుకునే ముందు మంచీ చెడూ బేరీజు వేసుకోగలగాలి. జగన్ ఆదేశాలు ఇబ్బందికరమైతే ఆయనను నచ్చచెప్పి ఒప్పించే విధంగా ఉండాలి. కానీ దురదృష్టకర విషయమేంటంటే అప్పుడు చంద్రబాబు గాని, ఇప్పుడు జగన్ పరిపాలనలో సీఎంవో రాష్ట్రాన్ని శాసిస్తూ ఉండటం. వారు చెప్పిన దానికి తందానా అంటుండటమే. ముఖ్యమంత్రి చెప్పిన ప్రతిదానికీ తలూపే అధికారులు ఉండటంతోనే ఈ సమస్య తలెత్తుతుందన్నది మాజీ అధికారులు సయితం అంగీకరిస్తున్నారు.జగన్ ఐదు నెలల క్రితమే ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన ఇంకా పాలనపై అవగాహన పెంచుకోవాల్సి ఉంది. పట్టు సాధించాల్సి ఉంది. జగన్ ముఖ్యమంత్రి గా బాధ్యతలను చేపట్టిన నాటి నుంచి రాజకీయాంశాలను పక్కన పెట్టి కేవలం సంక్షేమ పథకాలపైనే ఎక్కువ దృష్టి సారించారు. నవరత్నాలతో పాటు తాను ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలుపర్చాలని కోరుతున్నారు. ప్రతి మంగళవారం స్పందన కార్యక్రమం పెట్టి ప్రజాసమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు. అయితే నిధుల కొరత విషయం స్పష్టంగా జగన్ దృష్టికి అధికారులు తీసుకెళ్లలేకపోతున్నారు. సీఎంవో ఆదేశాలను తూచ తప్పకుండా పాటించాల్సి వస్తుందని, తమకు ఉన్న ఇబ్బందులను కూడా సీఎంవో పట్టించుకోవడం లేదని సీనియర్ ఐఏఎస్ అధికారుల సయితం వ్యక్తిగత సంభాషణల్లో అంగీకరిస్తున్నారు.